Breaking News

మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్‌ మూవీ.. ఎక్కడంటే?

Published on Thu, 07/18/2024 - 14:19

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హరోం హర'. జూన్‌ 14న రిలీజైన ఈ సినిమాకు టాక్‌ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. దీంతో సరిగ్గా నెల రోజులకు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ చేశారు.

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలో రిలీజైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రత్యక్షమైంది. అలాగే జియో సినిమాలో హిందీ వర్షన్‌ విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్‌గా మెప్పించింది. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించగా సుమంత్‌ జి నాయుడు నిర్మించాడు.

కథ విషయానికి వస్తే..
1989లో కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్‌), అతని కుమారుడు శరత్‌(అర్జున్‌ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. పొలాల్ని కబ్జా చేస్తూ అడ్డొచ్చినవారిని అంతం చేస్తుంటారు. ఆ ప్రాంతంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలోకి సుబ్రమణ్యం(సుధీర్‌ బాబు) ల్యాబ్‌ అసిస్టెంట్‌గా వస్తాడు. అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)ను ప్రేమిస్తాడు. 

ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. దీని ఎఫెక్ట్‌ సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు మూడునెలల్లో తన తండ్రి చేసిన అప్పులు తీర్చాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో హీరో ఏం చేశాడు? అప్పులు తీర్చాడా? తనపై కక్ష సాధించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే!

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)