Breaking News

ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ

Published on Fri, 08/09/2024 - 00:52

⇒ వెబ్‌ సిరీస్, షార్ట్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన నేను ఫీచర్‌ ఫిల్మ్‌ చేయాలనుకున్న టైమ్‌లో అంకిత్‌ ద్వారా ‘కమిటీ కుర్రోళ్ళు’ కథ నా వద్దకు వచ్చింది. ఈ కథ నాకు, మా నాన్నకి బాగా నచ్చింది. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర అనుభూతిని పొందలేదు. ఈ కథలో నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. అందుకే ఈ కథతో ఎలాగైనా సినిమా నిర్మించాలని ఫిక్స్‌ అయి, తీశాను. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాశాడు వంశీ. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. నాకు నటించడమే ఇష్టం. నిర్మాత కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ టైమ్‌ నుంచి అలా జరిగిపోయిందంతే. 

⇒ ప్రతిభ ఒక్కటే కాదు... క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతామని చిరంజీవిగారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ వంశీలో చూశాను. ఈ చిత్రంలోని పదకొండు మంది అబ్బాయిల పాత్రల్లో నన్ను నేను ఊహించుకున్నాను. ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రయాణం చేస్తాడు. 

⇒ నా గురించి బయటివారు చేసే విమర్శలు, పొగడ్తల్ని పట్టించుకోను. నా గురించి నిజాయతీగా ఉన్నది ఉన్నట్లు (పొగడ్త అయినా, విమర్శ అయినా) చెప్పేది మా అమ్మానాన్న (పద్మజ, నాగబాబు), అన్నయ్యే (వరుణ్‌ తేజ్‌). ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాని మా అన్నయ్య, వదిన (లావణ్య త్రిపాఠి) చూశారు.. వాళ్లకి బాగా నచ్చింది. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో ఓ వెబ్‌ సిరీస్‌ చేశాను.  

‘‘మంచి కథలకే తొలిప్రాధాన్యం ఇస్తా. కథ బాగుండి నా పాత్రకిప్రాధాన్యం ఉంటే మిగతా అంశాలను పట్టించుకోను. చిన్న పాత్ర, చిన్న హీరో అని కూడా ఆలోచించను. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే ఆలోచన వల్లో.. వేరే ఏదైనా కారణమేమో తెలియదు కానీ తెలుగు దర్శకులు ఎక్కువగా నన్ను సంప్రదించడం లేదు. అయితే నాకు సౌకర్యంగా అనిపిస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ’’  అని నటి, నిర్మాత నిహారిక కొణిదెల అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్‌ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి రిలీజ్‌  చేస్తున్నారు. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల చెప్పిన విశేషాలు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?