'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్‌.. గట్టిగానే బాయ్‌కాట్‌ దెబ్బ

Published on Fri, 07/25/2025 - 08:00

పవన్‌ కల్యాణ్‌ నటించిన 'హరిహర వీరమల్లు'కు బాయికాట్‌ దెబ్బ గట్టిగానే తగిలింది. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఏ చిత్రం బతికి బట్ట కట్టలేదని మరోసారి నిరూపితం అయింది. ఎంత పెద్ద హీరో ఉన్నా సరే ఆ సినిమాకు కష్టాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే గేమ్‌ ఛేంజర్‌, లైలా, రిపబ్లిక్‌, మట్కా వంటి చిత్రాలు బాయికాట్‌ దెబ్బతో మొదటిరోజే కనిపించకుండా పోయాయి. ఇప్పుడు హరిహర మీరమల్లు కూడా మొదటిరోజే ప్యాకప్‌ చెప్పే పరిస్థితి వచ్చింది. సినిమాలు చేసుకోండి. కానీ, ఆ వేదికలపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాల కలెక్షన్స్‌ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.

'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్‌
హరిహర వీరమల్లును ఎలాగైనా నిలబెట్టాలని పవన్‌ కల్యాణ్‌ అనుకున్నారు. కానీ, సినిమా వేదికపై ఆయన రాజకీయాలు మాట్లాడటం.. ఆపై ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పరుష వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో వైఎస్సార్‌సీపీ అభిమానులు భగ్గుమన్నారు. #BoycottHHVM హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ చేశారు. ఈ దెబ్బ గట్టిగానే వీరమల్లుకు గుచ్చుకుంది. ఈ చిత్రం ప్రచారం కోసం పవన్‌ కల్యాణ్‌ ఏకంగా మూడు రోజులు ప్రచారంలోనే మునిగిపోయారు. వరుస మీడియా సమావేశాలు ఆపై సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లతో సెల్ఫీలు వంటివి గట్టిగానే చేశారు. కేవలం ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల వల్ల ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయింది.

పుష్ప2 సినిమా మొదటిరోజు కలెక్షన్స్‌ (294 కోట్లు) దాటేస్తామని చెప్పుకున్న పవన్‌ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌ షోలతో కలిపి మొదటిరోజు రూ. 70 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ మాత్రమే 'వీరమల్లు' రాబట్టింది. నెట్‌ పరంగా అయితే రూ. 47 కోట్లు మాత్రమేనని ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిల్క్ పేర్కొంది. సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచి ఆపై 700 వందలకు పైగా ప్రీమియర్‌ షోలు వేస్తేనే కలెక్షన్స్‌ ఇలా ఉంటే... ఎలాంటి బెనిఫిట్స్‌ లేకుంటే 'వీరమల్లు' పరిస్థితి ఊహించుకోవడమే కష్టమని చెప్పవచ్చు.

వీరమల్లుకు బెనిఫిట్‌ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్‌ వస్తే.. మొదటిరోజు రూ. 34.5 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని సాక్నిల్క్‌ పేర్కొంది. హైదరాబాద్‌, విజయవాడలో మాత్రమే అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ తెలిపింది. పుష్ప2 హిందీ వెర్షన్ మొదటి రోజున రూ. 72 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఆ రికార్డ్‌ను 'వీరమల్లు' మొత్తం కలెక్షన్స్‌తో కూడా టచ్‌ చేయలేకపోయాడు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)