Breaking News

'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్‌

Published on Sat, 07/26/2025 - 10:31

పవన్‌ కల్యాణ్‌ నటించిన 'హరి హర వీరమల్లు' భారీ అంచనాలతో జులై 24న విడుదలైంది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, ప్రీమియర్‌ షోలు పూర్తి అయన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. పేలవమైన కథాంశం, విఎఫ్ఎక్స్ కారణంగా 'వీరమల్లు' విమర్శల పాలైంది. దీంతో మొదటిరోజు, ప్రీమియర్‌ షోలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 47 కోట్ల నెట్‌ వరకే పరిమితం అయింది. రెండోరోజులు పూర్తి అయ్యే సరికి రూ. 56.29 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌కు చేరుకుంది. అయితే, డే-2 మరింత దారుణమైన కలెక్షన్స్‌ రాబట్టినట్లు ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిల్క్ పేర్కొంది.

చిన్న హీరోల సినిమాలు విడుదలైతేనే మొదటిరోజు, రెండోరోజు అంటూ కలెక్షన్స్‌ మేకర్స్‌ ప్రకటిస్తారు. కానీ, 'హరి హర వీరమల్లు' చిత్ర యూనిట్‌ ఇప్పటి వరకు అధికారికంగా కలెక్షన్స్‌ వివరాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయితే, బాక్సాఫీస్‌ లెక్కలను మాత్రమే ఎప్పటికప్పుడు ప్రచురించే 'సాక్నిల్క్' మాత్రం ప్రపంచవ్యాప్తంగా వీరమల్లు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో పేర్కొంది. రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 8.79 కోట్ల నెట్‌ మాత్రమే రాబట్టినట్లు తెలిపింది. 

బెనిఫిట్‌ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్‌, మొదటిరోజు రూ. 34.75 కోట్ల నెట్‌, రెండో రోజు రూ. 8.79 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టి మొత్తంగా ఇప్పటి వరకు రూ. 56.29 కోట్ల నెట్‌ మాత్రమే రాబట్టింది. గ్రాస్‌ కలెక్షన్స్‌ పరంగా చూస్తే రెండురోజులకు గాను రూ. 92 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు శనివారం, ఆదివారం వీకెండ్‌ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో వీరమల్లు కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)