Breaking News

Hanuman OTT Rights: భారీ ధరకు 'హనుమాన్‌' ఓటీటీ రైట్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Published on Fri, 01/12/2024 - 10:42

సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా నేడు (జనవరి 12న) విడుదలైన హనుమాన్‌ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది. ఒకరోజు ముందే అంటే నిన్ననే భారీగా ప్రీమియర్‌ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ పాజిటివ్‌గానే రియాక్ట్‌ అవుతున్నారు.  తెలుగులో 'సూపర్‌మ్యాన్' జోనర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్‌ చిత్రంతో ఆ లోటు తీర్చడమే కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు.

ఇందులో  కథానాయకుడు తేజ సజ్జా రోల్‌ చాలా చక్కగా ఉంటుంది. తనలోని ఉన్న టాలెంట్‌ మొత్తాన్ని ఈ సినిమా కోసం ఉపయోగించాడు. అందుకే అతను తెరపై కనిపించినప్పుడు విజిల్స్‌ పడుతున్నాయి. ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమాను ప్రశాంత్‌ వర్మ తీశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 దక్కించుకుంది. పాన్‌ ఇండియా రేంజ్‌కు తగ్గట్లు సినిమా ఉండటంతో ఓటీటీ రైట్స్‌ భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పడవచ్చని సమాచారం.

(ఇదీ చదవండి: Hanu Man Review : ‘హను-మాన్‌’ మూవీ రివ్యూ)

ఏదేమైనా మార్చి నెలలో హనుమాన్‌ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉన్నట్లు సినిమా ఎండ్‌ కార్డ్‌లో ఉంటుంది. 2025లో జై హనుమాన్‌ పేరుతో పార్ట్‌-2 వస్తుందని దర్శకుడు ప్రకటించాడు. తేజ సజ్జ, అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్,సముద్రఖని వంటి నటీనటులు హనుమాన్‌లో నటించారు. చిన్న సినిమాగా మొదలైనప్పటికీ క్రమంగా స్కేల్‌ని పెంచుకొని 12 భాషల్లో విడుదల అయ్యేలా ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు.  పెద్ద సినిమాలకు దీటుగా సంక్రాంతి బరిలో హనుమాన్‌ నిలిచి హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్నాడు.

ఓటీటీ రైట్స్‌ ఎన్ని కోట్లంటే..

హనుమాన్‌ సినిమాపై విడుదల ముందు నుంచే భారీ క్రేజ్‌ ఏర్పడింది. ఓటీటీ హీందీ  వర్షన్‌ రూ. 5కోట్లు, తెలుగు వర్షన్‌ రూ. 11 కోట్లకు హనుమాన్‌కు సంబంధించిన హక్కులు అమ్ముడుపోయాయి.  ప్రముఖ ఎంటర్‌టైనింగ్‌ సంస్థ 'జీ5' ఈ హక్కుల్ని దక్కించుకుంది.  ఓ యువ హీరో నాలుగో సినిమానే ఇంత భారీ ధర పలకటం విశేషమని అప్పట్లో సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా ఉన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)