Breaking News

సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Fri, 04/03/2026 - 10:29

హనుమాన్ ఫేమ్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌  స్వీయ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్‌ మూవీ సరస్వతి. ఈ చిత్రంలో ప్రియమణి ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, రాధికా శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 6న విడుదలైంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా రాణించలేకపోయింది. ఈ సినిమాతో వరలక్ష్మీ దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా  స్ట్రీమింగ్‌ అవుతోంది. తమిళం, తెలుగు భాషలతో పాటు కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో చూడనివారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

సరస్వతి కథేంటంటే..

లక్ష్మి(వరలక్ష్మి శరత్‌కుమార్‌) సింగిల్‌ మదర్‌. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్ట్‌ 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్‌ బాక్స్‌ ఇచ్చి స్కూల్‌లో డ్రాప్‌ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్‌లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్‌లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదేరోజు రాత్రి స్కూల్‌ నుంచి లక్ష్మికి ఓ ఫోన్‌ వస్తుంది.  తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదేరాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.

అయితే సీఐ కృష్ణారెడ్డి(మురళీ శర్మ) మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్‌ చేస్తానంటూ.. శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది.  న్యాయవాది రామానుజం (ప్రకాశ్‌ రాజ్‌)ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయ సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి?  సరస్వతిపై అత్యాచారానికి పాల్పడిందెవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్‌ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. 

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)