Breaking News

ఆ విషయంలో నయనతార కంటే స్పీడుగా ఉన్న హన్సిక

Published on Sun, 01/22/2023 - 08:39

స్టార్‌ హీరోయిన్‌ నయనతార కంటే హన్సిక ముందంజలో ఉంది. హన్సికతో లేడీ సూపర్‌స్టార్‌ నయనతారతో పోలికేంటి? అసలీ కహానీ ఏంటనుకుంటున్నారా? ఈ ముద్దుగుమ్మలిద్దరూ క్రేజీ హీరోయిన్లే. ఇద్దరూ బహుభాషా నటీమణులే. ఇద్దరూ ప్రేమ వ్యవహారంలో చేదు అనుభవాలను చవిచూసినవాళ్లే. ఇంకా చెప్పాలంటే నయనతార, హన్సిక నటుడు శింబును ప్రేమించి విఫలమైన వాళ్లే. అయితే నయనతార స్టార్‌ ఇమేజ్‌ కాస్త ఎక్కువంతే. చివరికి ఇద్దరూ ప్రేమ వివాహాలతో సెటిలైనవాళ్లే.ఇద్దరి పెళ్లిళ్లు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. ఆ పెళ్లిళ్లతో ఇద్దరూ సొమ్ము చేసుకున్నారు.

నయనతార విఘ్నేశ్‌తో పెళ్లి తతంగం అంతా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థ పర్యవేక్షణలో జరిగింది. అదే విధంగా నటి హన్సిక ముంబై వ్యాపారవేత్త సోహైల్‌ను ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఆర్భాటంగా జరిగిన వీరి పెళ్లి తతంగాన్ని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి ప్రసార హక్కులను పొందినట్లు ప్రచారం జరిగింది. వీరి పెళ్లి వీడియో ప్రసారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటి నయనతార పెళ్లి జరిగి ఏడు నెలలు పైగా అవుతోంది. ఇప్పటివరకు ఆ పెళ్లి వేడుక ఓటీటీలో ప్రసారం కాలేదు. ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటిది ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లి తంతు వీడియో త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని హన్సిక వీడియో ద్వారా స్వయంగా వెల్లడించింది. అలా ఈ భామ నయనతార కంటే ముందంజలో ఉందన్నమాట!

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)