Breaking News

హరర్‌ సినిమాతో వస్తున్న స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Published on Sat, 06/01/2024 - 08:48

గ్లామర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌.. హన్సిక. ఆమె ఇప్పుడు 'గాంధారి'గా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆర్‌. కన్నన్‌ స్వీయ దర్శకత్వం వహించడంతోపాటు మసాలా పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈయన దర్శకత్వంలో, ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌ చిత్రం విశేష ఆదరణ పొందింది. అదేవిధంగా ఇంతకు ముందు జయం కొండాన్‌, కండెన్‌ కాదలై, సేటై, ఈవెన్‌ తందిరన్‌, బిస్కోత్‌ వంటి పలు వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా 'గాంధారి' పేరుతో చిత్రాన్ని చేస్తున్నారు.

ఇది ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కమర్షియల్‌ అంశాలతో కూడిన హారర్‌ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని తాజాగా ఆయన వెల్లడించారు. ఇందులో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే యువతిగా హన్సిక నటిస్తున్నారని తెలిపారు. పురాతన కాలంలో ఓ రాజు నిర్మించిన గాంధర్వ కోటను పరిశోధించడానికి వెళ్లగా, అక్కడ ఆమెకు పలు ఆశ్చర్యకరమైన ఘటనలు ఎదురవుతాయన్నారు.

ఇందులో హన్సిక పురావస్తు శాఖ అధికారిగా, ఓ ప్రాచీన తెగకు చెందిన యువతిగా దిపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం చైన్నె సముద్ర తీరంలో రూ.60 లక్షల వ్యయంతో బ్రహ్మాండమైన కొండ ఇంటి సెట్‌ వేసి అందులో 1943 నాటి సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఇందులో మెట్రో శిరీష్‌, మయిల్‌ సామి, తలైవాసల్‌ విజయ్‌, ఆడుగళం నరేన్‌, స్టంట్‌ సిల్వ, వినోదిని, పవన్‌ కుడివేలు మురుగన్‌, కలైరాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 2025లో  సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా గాంధారి సినిమా రిలీజ్‌ అవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)