Breaking News

విడాకుల రూమర్స్‌.. హన్సిక ఆసక్తికర పోస్ట్‌

Published on Mon, 08/11/2025 - 13:54

హీరోయిన్‌ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆమె భర్తకు దూరంగా ఉందని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హన్సిక తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా పుట్టిన రోజు (ఆగస్ట్‌ 9) వేడుకలు జరుపుకున్న ఆమె.. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్‌ అని..ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు.

‘ఈ ఏడాది(2025) నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది. ఈ పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగిపోతోంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని హన్సిక ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో మరోసారి హన్సిక విడాకుల విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

2022 డిసెంబర్‌లో హన్సిక తన ప్రియుడు సోహైల్‌ని వివాహం చేసుకుంది. సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్‌ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్‌ అవుతోంది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)