Breaking News

కుర్రాళ్ల సినిమా.. మనోళ్లకు ఎక్కేసింది!

Published on Tue, 04/29/2025 - 12:33

తెలుగు ఇండస్ట్రీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. స్ట్రెయిట్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే థియేటర్లకు జనాలు సరిగా రావట‍్లేదు. కొందరు దర్శక నిర్మాతలేమో రివ్యూయర్లదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ లో పొరపాట్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.

(ఇదీ చదవండి: 'ది ఫ్యామిలీ మ్యాన్‌-3' నటుడు అనుమానాస్పద మృతి) 

ఎందుకంటే కంటెంట్ సరిగా ఉండి ఎంటర్ టైన్ చేస్తే మనది కాదా అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. గతవారం 'సారంగపాణి' ‍సినిమాతో పాటు జింఖానా, తుడురమ్ అనే డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజయ్యాయి. స్ట్రెయిట్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు.

అదే టైంలో 'ప్రేమలు' హీరో నస్లేన్ నటించిన 'జింఖానా'కు మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ..  కామెడీ కనెక్ట్ అయ్యేలా ఉండటం దీనికి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి రూ.2.70 కోట్ల మేర వసూళ్లు వచ్చాయని టాక్.

(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) 

చాలా తెలుగు సినిమాలతో పోలిస్తే 'జింఖానా'పై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఈ కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలకు లాభాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు విడుదల వరకు దీనిపై పెట్టుబడి కూడా అంత ఎక్కువ పెట్టి ఉండరుగా!

జింఖానా విషయానికొస్తే.. అలెప్పీకి చెందిన కొందరు కుర్రాళ్లు.. ఇంటర్ ఫెయిలవుతారు. స్పోర్ట్స్ కోటాలో డిగ్రీ సీటు సంపాదించాలని బాక్సింగ్ నేర్చుకుంటారు. లోకల్ పోటీల్లో ఎలాగోలా గెలిచేస్తారు. దీంతో రాష్ట‍్ర స్థాయి పోటీలకు రెడీ అవుతారు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు గెలిచారా లేదా అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ సినిమా) 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)