Breaking News

సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత

Published on Sun, 07/20/2025 - 11:54

చెన్నై: నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (GV Prakash Kumar) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లాక్‌మెయిల్‌. తేజు అశ్విని, బిందు మాధవి కథానాయికలుగా నటించారు. మిస్సెస్‌ జేడీఎస్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ పతాకంపై అమల్‌ రాజ్‌ నిర్మించిన మొదటి చిత్రం ఇది. ఎం.మారం కథా, దర్శకత్వం వహించగా శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. 

చివర్లో..
ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక వడపళనిలోని  కమలా థియేటర్‌లో నిర్వహించారు. దర్శక సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయ్‌ కుమార్, వసంత బాలన్, అధిక్‌ రవిచంద్రన్, నిర్మాత కదిరేసన్, ధనుంజయన్‌ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అమల్‌ రాజ్‌.. జీవీ ప్రకాశ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. చివర్లో 8 రోజుల షూటింగ్‌ను పూర్తి చేయలేని సమయంలో జీవీ ప్రకాష్‌ తనకు అండగా నిలబడ్డారన్నారు. 

రుణపడి ఉంటా
ఏమీ ఆశించకుండా సగం పారితోషికం మాత్రమే తీసుకొన్నారని పేర్కొన్నారు. షూటింగ్‌ పూర్తి చేయడంతో పాటు ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ చేసే వరకు హీరోనే కారకుడయ్యారన్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. నటుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మారం ప్రతిభావంతుడైన దర్శకుడని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్న అమల్‌ రాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నటి తేజుతో ఇంతకుముందు ఒక వీడియో సాంగ్‌ కోసం నటించానని అది బాగా వైరల్‌ అయిందని, ఆ విధంగా ఆమె ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక అయ్యారని జీవీ ప్రకాష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

చదవండి: పారితోషికం భారీగా పెంచేసిన జాన్వీ.. ‘పెద్ది’కి ఎంతంటే..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)