Breaking News

భార్యకు విడాకులిచ్చి హీరోయిన్‌తో ప్రేమాయణం?.. స్పందించిన హీరో

Published on Thu, 02/20/2025 - 12:43

సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్‌ (G. V. Prakash Kumar)- సింగర్‌ సైంధవి (Saindhavi)ల విడాకులను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరంభం నుంచి ఒకరికోసం ఒకరు తోడుగా నిలబడ్డ ఈ దంపతులను ఇకపై జంటగా చూడలేమన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇదే సమయంలో జీవీ ప్రకాశ్‌.. హీరోయిన్‌ దివ్య భారతి (Divya Bharathi)తో ప్రేమలో పడ్డాడన్న ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్‌తో లవ్‌ రూమర్స్‌..
ఈ పుకార్లపై జీవీ ప్రకాశ్‌ పెదవి విప్పాడు. అతడు మాట్లాడుతూ.. మేము బ్యాచిలర్‌ సినిమా కోసం కలిసి పని చేశాం. అంతమాత్రానికే మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని జనాలు ఏవేవో ఊహించుకుంటున్నారు. అది నిజం కాదు. ఒకరితో మరొకరికి ఏ సంబంధమూ లేదు. కేవలం సాధారణ స్నేహితులం మాత్రమే. సినిమా షూటింగ్‌ అయ్యాక ఒక్కసారి కూడా కలుసుకోలేదు. మళ్లీ ఇలా ప్రమోషన్స్‌లో మాత్రమే కలుసుకున్నాం అని చెప్పాడు. దివ్య భారతి మాట్లాడుతూ.. జీవీ ప్రకాశ్‌ భార్యకు విడాకులివ్వడానికి నేనే కారణమని చాలామంది మెసేజ్‌లు పెడుతూనే ఉన్నారు. ఈ విషయంలో నన్ను టార్గెట్‌ చేస్తారని అస్సలు ఊహించలేదు. కానీ తనతో నాకెలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చింది.

వైవాహిక జీవితానికి ముగింపు
జీవీ ప్రకాశ్‌- సైంధవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో దాంప్యత బంధంలోకి అడుగుపెట్టిన వీరు 2020లో కూతురికి జన్మనిచ్చారు. పదకొండేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సినిమాల విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్‌, దివ్య భారతి 'కింగ్‌స్టన్‌' మూవీ కోసం మరోసారి జతకట్టారు. బ్యాచిలర్‌ సక్సెస్‌ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం. ఈ మూవీ మార్చి 7న విడుదల కానుంది.

చదవండి: ఒంటరి జీవితం చాలా కష్టం.. సమంత పోస్ట్‌ వైరల్‌

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)