Breaking News

కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి: బ్రహ్మానందం

Published on Wed, 08/06/2025 - 00:25

‘‘కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి.. అప్పుడే ఒక ఫ్రెష్‌ నెస్‌ వస్తుంది. అలాగే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్‌ చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ సినిమా నాకు ప్రత్యేకం అని చెప్పగలను. ఎందుకంటే.. యువతరమంతా కలిసి తీసిన ఈ చిత్రంలో నేను జడ్జి పాత్రలో నటించాను’’ అని ప్రముఖ నటుడు బ్రహ్మానందం తెలిపారు. నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్‌ శ్రీను ఇతర పాత్రలు పోషించారు.

డా.సంధ్య గోలీ సమర్పణలో వేణు సడ్డి, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్‌ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ మురళీ మనోహర్‌ మాట్లాడుతూ–‘‘డార్క్‌ కామెడీగా రూ పొందిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాని సూపర్‌ హిట్‌ చేస్తారని కోరుకుంటున్నాం’’ అని జయకాంత్, అమర్‌ బురా, డా.సంధ్య గోలీ కోరారు.

యోగిబాబు మాట్లాడుతూ– ‘‘గుర్రం పాపిరెడ్డి’ ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌లో తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో సౌధామిని పాత్రలో నటించాను. మా అమ్మ ఈ చిత్రంలో అతిథి పాత్ర చేశారు’’ అని ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు. ‘‘బ్రహ్మానందంగారు, యోగి బాబుగారు వంటి స్టార్స్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని నరేష్‌ అగస్త్య చెప్పారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)