Breaking News

'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌' విడుదల తేది ప్రకటించిన విజయ్‌

Published on Thu, 04/11/2024 - 14:48

దళపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ విడుదల తేది ఫిక్స్‌ అయింది. విజయ్‌ కెరీర్‌లో 68వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విజయ్ డబుల్‌ రోల్‌లో కనిపించిన  పోస్టర్ రిలీజ్ అయింది. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. 1971లో డిబి కూపర్ అనే వ్యక్తి విమానంలో భారీ దొంగతనానికి పాల్పడి గాలిలో విమానం నుంచి పారాచ్యుట్ తో దూకేసాడు. ఆ కూపర్ అనే వ్యక్తి ఇప్పటికి దొరకలేదు. ఆ మిస్టరీని బేస్ చేసుకొని ఈ సినిమాని తీస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ సినిమాను సెప్టెంబ‌ర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు విజ‌య్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. రంజాన్‌ సందర్భంగా అభిమానులకు ఇలా కానుకగా సినిమా విడుదల తేదిని ప్రకటించారని ఫ్యాన్స్‌ అంటున్నారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉంది. పైగా శనివారం కూడా కలిసి వస్తుంది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్స్ పరంగా మరింత కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)