ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను: గౌతమ్‌ తిన్ననూరి

Published on Tue, 08/05/2025 - 01:47

‘‘కింగ్‌డమ్‌’ చిత్రం విడుదలకు ముందు చివరి నిమిషం వరకూ తుది మెరుగులు దిద్దడానికి ప్రయత్నించాం. దాని వల్ల నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను. ఏ కథైనా, సన్నివేశమైనా అందులో ఉన్న భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా చేయగలగాలి. ‘కింగ్‌డమ్‌’ విషయంలో కూడా అదే సూత్రం ఫాలో అయ్యాను. ఇందులో యాక్షన్‌ ఉన్నప్పటికీ దాని చుట్టూ బలమైన ఎమోషన్‌ ఉంటుంది. ఆ భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యాయి కాబట్టే యాక్షన్‌ వర్కౌట్‌ అయింది’’ అని డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి తెలి పారు.

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్‌’. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జూలై 31న విడుదలైంది. సోమవారం గౌతమ్‌ తిన్ననూరి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నిజానికి విజయ్‌ దేవరకొండతో చేద్దామనుకున్న కథ వేరు. కానీ, మా ప్రయాణం మొదలైన తర్వాత ‘కింగ్‌డమ్‌’ కథ ఆయనకి సరిగ్గా సరిపోతుందని భావించి చెప్పగానే ఒప్పుకున్నారు. వెంకటేశ్‌ని ఆడిషన్‌ చేసినప్పుడు సినిమా పట్ల, నటన పట్ల తన తపన చూసి మురుగన్‌ పాత్రకి తీసుకున్నాం.

శివ పాత్ర నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు సత్యదేవ్‌. ‘కింగ్‌డమ్‌’ నుంచి ‘హృదయం లోపల...’ పాటని తొలగించాం. కథా గమనానికి అడ్డంకిగా ఆ పాట ఉందనిపించి నేను, ఎడిటర్‌ నవీన్‌ నూలిగారు, నాగవంశీగారు, విజయ్‌గారు.. ఇలా అందరం చర్చించుకొని తొలగించాం. ఓటీటీ వెర్షన్‌లో ఆ సాంగ్‌తో పాటు కొన్ని సన్నివేశాలు కూడా జోడించే ఆలోచన ఉంది. ‘కింగ్‌డమ్‌’ రెండో భాగం మూల కథ ఉంది. స్క్రిప్ట్‌ వర్క్‌ త్వరలో ప్రారంభిస్తాం. ఈలోపు ఓటీటీ కోసం ఓ వెబ్‌ ఫిల్మ్‌ చేస్తాను’’ అని తెలి పారు.  

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)