వంద కోట్ల సినిమాలో ఆఫర్‌.. అంత ఈజీగా ఒప్పుకోనంటున్న నటుడు

Published on Thu, 09/21/2023 - 11:48

కొందరు సినిమా ఛాన్స్‌ వస్తే చాలనుకుంటారు, మరికొందరు మంచి రోల్‌ వస్తేనే చేస్తామంటారు. బాలీవుడ్‌ నటుడు గోవింద రెండో కేటగిరీకి చెందినవాడు. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయే రకం కాదు. చిన్న చిత్రమైనా, పెద్ద సినిమా అయినా తన మనసుకు నచ్చితేనే అందులో నటిస్తాడు. ఈమాటకు కట్టుబడి నాలుగేళ్లగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను దేన్నీ అంత సులువుగా అంగీకరించను. జనాలేమో నాకు అవకాశాలు రావడం లేదనుకుంటారు. కానీ వినాయకుడి ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉన్నాయి. నాకు ఛాన్సులు వస్తున్నాయి. గతేడాది నేను.. వంద కోట్లతో తెరకెక్కిన ప్రాజెక్టులను రిజెక్ట్‌ చేశాను. అసలు ఏ సినిమాకూ సంతకం చేయలేదు. దీంతో అద్దం ముందు నిల్చుని నన్ను నేను కొట్టుకున్నాను. నిజానికి వాళ్లు చాలా డబ్బు ఇస్తామన్నారు, కానీ నాకు ఏదిపడితే అది, పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేయడం ఇష్టం లేకపోవడంతో వదిలేసుకున్నాను. ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తాను' అని చెప్పుకొచ్చాడు.

కాగా గోవింద 1986లో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టాడు. 170కు పైగా చిత్రాల్లో నటించాడు. హీరో నెం.1, షోలా ఔర్‌ షబ్నం, పార్ట్‌నర్‌ వంటి అనేక హిట్‌ చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. ఈయన చివరగా 2019లో వచ్చిన రంగీలా రాజా సినిమాలో నటించాడు. అప్పటినుంచి మరే చిత్రంలోనూ కనిపించలేదు.

చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్‌గా ఫోటోలు లీక్‌.. అంటే ముందే ప్లాన్‌.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్‌ ఫైర్‌

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)