Breaking News

అవతార్‌ సినిమాలో ఛాన్స్‌.. కోట్లు ఇస్తానన్నా 'నో' చెప్పా: గోవిందా

Published on Mon, 03/10/2025 - 16:59

ప్రపంచాన్నే అబ్బురపరిచిన సినిమాల్లో అవతార్‌ (Avatar Movie) ఒకటి. వేల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో ఆఫర్‌ వస్తే చేయనని చెప్పేశాడట బాలీవుడ్‌ నటుడు గోవిందా (Actor Govinda). అసలు అవతార్‌ సినిమా ఛాన్స్‌ తనకెలా వచ్చింది? ఎందుకు రిజెక్ట్‌ చేశాడు? వంటి విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గోవిందా మాట్లాడుతూ.. అమెరికాలో నేనొక సర్దార్‌ను కలిశాను. ఆయనకు నేనిచ్చిన బిజినెస్‌ ఐడియా బాగా వర్కవుట్‌ అయింది. 

అవతార్‌ టైటిల్‌ నేనే ఇచ్చా..
కొన్నేళ్ల తర్వాత ఆయన నన్ను జేమ్స్‌ కామెరూన్‌కు పరిచయం చేశాడు. జేమ్స్‌తో కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. సరేనని తనను డిన్నర్‌కు పిలిచి సినిమా గురించి మాట్లాడాం. ఆయన చెప్పిన కథ విని దానికి అవతార్‌ అన్న టైటిల్‌ పెడితే బాగుంటుందని చెప్పాను. సినిమాలో హీరో దివ్యాంగుడు అని చెప్పాడు. వెంటనే నేను చేయనని చెప్పేశాను. రూ.18 కోట్లు ఇస్తానన్నా వద్దన్నాను.

శరీరానికి రంగు పూసుకోవడం..
దాదాపు 410 రోజులు ఆయన సినిమాకే కేటాయించాలి. అది పర్వాలేదు కానీ నా శరీరానికి రంగు పూసుకునే ఉండాలి. అలా చేస్తే నేను ఆస్పత్రిపాలవుతాను. నటుడిగా నాకు శరీరం అనేది చాలా అవసరం. పెయింట్‌ పూసుకోవడం వల్ల ఏవైనా దుష్ఫలితాలు ఎదురైతే జీవితాంతం బాధను అనుభవించాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి మంచి సినిమాలకు నో చెప్తే అందరూ లైట్‌ తీసుకోలేరు. వారు దగ్గరివారైనా సరే ఇగో చూపిస్తారు. 

బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా అవతార్‌
అలాంటప్పుడు ఏళ్ల తరబడి క్షమాపణలు చెప్తూనే ఉండాలి అని చెప్పుకొచ్చాడు. జేమ్స్‌ కామెరూన్‌ తీసిన అద్భుత చిత్రాల్లో అవతార్‌ ఒకటి. 2009లో రిలీజైన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. తర్వాత దీనికి కొనసాగింపుగా 2022లో అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్‌ రిలీజైంది. గోవిందా విషయానికి వస్తే ఆయన నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇటీవల అతడే స్వయంగా ఓ షోలో వెల్లడించాడు.

చదవండి: ఎన్నో దారుణమైన సౌత్‌ సినిమాలకంటే కంగువా బెటర్‌: జ్యోతిక

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)