Breaking News

గోపీచంద్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఓటీటీకి వచ్చేస్తోన్న రామబాణం!

Published on Thu, 09/07/2023 - 15:37

మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన రామబాణం. శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జగరపతిబాబు, ఖుష్బూ ప్రధానపాత్రలు పోషించారు. అయితే ల‌క్ష్యం, లౌక్యం వంటి హిట్స్ త‌ర్వాత గోపీచంద్‌, శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, డింపుల్‌ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది.

(ఇది చదవండి: బాలీవుడ్‌లో మరో సినిమా చేస్తోన్న ధనుష్.. ముచ్చటగా మూడోసారి! )

మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామబాణం... నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ ఇంకెప్పుడు ఓటీటీలోకి వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం గుడ్ న్యూస్‌ చెప్పింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో గోపీచంద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీ రానుండడంతో  ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

(ఇది చదవండి: సీనియర్‌ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా..)

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)