Breaking News

ఈ పుడమికి కావలి నువ్వు

Published on Sat, 06/20/2026 - 00:28

గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న చారిత్రక యాక్షన్‌ చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో   రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అనుదీప్‌ దేవ్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వీర జయధీర...’ అంటూ సాగే తొలి పాటను శనివారం విడుదల చేశారు.

‘ఓ వీర... జయధీర.., ఓ వీర... ధ్రువతార.., పయనించే శిఖరం నువ్వేరా... ప్రవహించే సమరం నువ్వేరా.., ఈ పుడమికి కావలి నువ్వురా... ఆ కడలికి కంచెవు నువ్వురా... గగనానికి గొడుగైనావురా... అయినా నువ్వే ఒంటరి...’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటను దీపక్‌ బ్లూ, లక్ష్మీ మేఘన పాడారు. 
‘‘క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ‘భరత వర్ష’ మూవీ ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌తో అంచనాలను పెంచుతూనే ఉంది.

‘వీర జయధీర...’ కథానాయకుడి ప్రయాణాన్ని, అతని పరివర్తనను ఆవిష్కరించే పవర్‌ఫుల్‌ పాటగా నిలుస్తుంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి పరాక్రమవంతమైన యోధుడిగా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు, పట్టుదల, లక్ష్యసాధన కోసం చేసిన పోరాటాన్ని ఈ పాట భావోద్వేగంగా చూపిస్తుంది. కథలోని ప్రధాన పాత్ర అంతర్మథనాన్ని, అతని జీవిత గమ్యాన్ని ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్‌ రాజన్‌. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)