Breaking News

ప్రేక్షకులకు నవ్వు ఆగదు: గోపీచంద్‌

Published on Wed, 10/09/2024 - 00:30

‘‘విశ్వం’ చిత్రం షూటింగ్‌లో ప్రతి సన్నివేశం చేసేటప్పుడు నవ్వుకుంటూనే ఉన్నాం. వినోదం, యాక్షన్‌ అద్భుతంగా వచ్చాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు నవ్వు ఆగదు... చాలా ఎంజాయ్‌ చేస్తారు. ఒక్క మాట చెప్పగలను... శ్రీను వైట్లగారు ఈజ్‌ బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌’’ అని గోపీచంద్‌ అన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్‌ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గోపీచంద్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీను వైట్లగారి సినిమా లో ఎంత వినోదం ఆశిస్తారో... అంతకు మించి ఇవ్వడానికి ఆయన ‘విశ్వం’ స్క్రిప్ట్‌పై దాదాపు 7 నెలలు పని చేశారు. నేను చాలా సినిమాలు చేశాను. ఆయన వద్ద ఉండే సౌకర్యం ఎక్కడా ఫీల్‌ అవ్వలేదు. రాజీ పడకుండా ఈ సినిమా తీసిన విశ్వప్రసాద్, చక్రపాణిగార్లకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ–‘‘విశ్వం’ అందమైన ప్రయాణం. ఈ సినిమాని అనుకున్నట్లు తీయగలిగా. ఈ చిత్రం అందర్నీ నవ్విస్తుందని వంద శాతం నమ్మకం ఉంది’’అని చెప్పారు. 

‘‘విశ్వం’ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. అందరూ మా సినిమాని ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. ‘‘మా కుటుంబం 86 ఏళ్ల నుంచి సినిమాల్లో ఇన్వాల్వ్‌ అయింది. ‘విశ్వం’ నాకు తొలి సినిమా. ఇది మా హీరో సినిమా అని గోపీచంద్‌ అభిమానులు కాలర్‌ ఎగరేసేలా ఉంటుంది’’ అని వేణు దోనేపూడి పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)