Breaking News

యుద్ధానికి పిలుపు 

Published on Fri, 02/16/2024 - 01:11

అమెరికన్‌ ఫిల్మ్స్‌ ‘గాడ్జిల్లా’ ఫ్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌’ (2024). రెబెక్కా హాల్, బ్రియాన్‌ టైరీ హెన్రీ, డన్‌ స్టీవెన్స్, కైలీ హోట్లీ, అలెక్స్‌ ఫెర్న్స్, ఫలా చెన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో లెజండరీ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమాను వార్నర్‌ బ్రదర్స్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

‘గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌’ చిత్రం అంతర్జాతీయంగా మార్చి 27న, యునైటెడ్‌ స్టేట్స్‌లో మార్చి 29న, జపాన్‌లో ఏప్రిల్‌ 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌’ నుంచి లేటెస్ట్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మేము ఓ సిగ్నల్‌ని కనుగొన్నాం’, ‘ఏదో ఊహించనది జరగబోతోంది’, ‘అది కేవలం సిగ్నల్‌ మాత్రమే కాదు.. యుద్ధానికి పిలుపు’ వంటి డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ఇక 2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌’కి సీక్వెల్‌గా ‘గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌’ చిత్రం తెరకెక్కింది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)