Breaking News

అర్ధరాత్రి బ్రేకప్‌ అంటూ మెసేజ్‌.. పిచ్చిదాన్నయ్యా: జెనీలియా

Published on Thu, 10/03/2024 - 18:38

జెనీలియా.. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ కనిపించే ఈ బ్యూటీ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌తో లవ్‌లో ఉన్నప్పుడు ఓసారి తను అనుభవించిన బాధను పంచుకుంది. ఇంతకీ ఏమైందో జెనీలియా మాటల్లోనే విందాం.. రితేశ్‌, నేను ప్రేమించుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇది. తను చాలా లేట్‌గా నిద్రపోతాడు, నేనేమో ముందుగానే పడుకునేదాన్ని. 

ఒంటిగంటకు ఆ మెసేజ్‌
ఓ రోజు అతడు ఇంతటితో ఆపేద్దాం అంటూ బ్రేకప్‌ మెసేజ్‌ పెట్టాడు. రాత్రి ఒంటిగంటకు ఆ మెసేజ్‌ పెట్టి పడుకున్నాడు. నేను అది తెల్లవారుజామున రెండున్నరకు చూశాను. నాకేం అర్థం కాలేదు. అసలెందుకిలా మెసేజ్‌ చేశాడని చాలా ఒత్తిడికి లోనయ్యాను. రాత్రంతా నిద్రపట్టలేదు. పొద్దున తొమ్మిదింటికి అతడు ఎప్పటిలా ఫోన్‌ చేసి ఏం చేస్తున్నావ్‌? అని చాలా సాధారణంగా మాట్లాడాడు. 

ఏప్రిల్‌ ఫూల్‌..
అప్పటికే టెన్షన్‌, బాధలో ఉన్న నేను.. ఇకపై మనం మాట్లాడుకోకూడదు, నేను నీతో మాట్లాడను అని చెప్పాను. అందుకతడు ఏమీ తెలియనట్లు ఏమైంది? ఎందుకలా కోప్పడుతున్నావ్‌? అని అడిగాడు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు ఎందుకు యాక్టింగ్‌ చేస్తున్నావ్‌? రాత్రి బ్రేకప్‌ అని మెసేజ్‌ చేశావ్‌గా అని నిలదీశాను. రితేశ్‌ నవ్వుతూ.. ఈరోజు ఏప్రిల్‌ ఫూల్స్‌ డే. అందుకే అలా చెప్పానన్నాడు. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్‌ చేస్తారా? అని చాలాసేపు క్లాస్‌ పీకాను.

నా అదృష్టం
రితేశ్‌కు మహిళలంటే చాలా గౌరవం. నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. నేను షూటింగ్‌కు వెళ్లినప్పుడు పిల్లలను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోతాడు. మనసస్ఫూర్తిగా ఇంట్లో పనులన్నీ చేస్తాడు. ఇలా అన్నీ చూసుకునే పార్ట్‌నర్‌ దొరకడం నిజంగా నా అదృష్టం అని జెనీలియా చెప్పుకొచ్చింది.

చదవండి: ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)