Breaking News

సౌత్‌లో మంచి రోల్స్‌ ఇవ్వలే? యాంకర్‌కు కౌంటర్‌ ఇచ్చిన జెనీలియా

Published on Thu, 06/19/2025 - 15:56

జెనీలియా.. హహ.. హాసినిగా ఇప్పటికీ తెలుగు ‍ప్రేక్షకులకు సుపరిచితురాలే! బొమ్మరిల్లు ఒక్కటే కాదు సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, ఆరెంజ్‌.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. ఇందులో కొన్ని సినిమాలు పలు భాషల్లో రీమేక్‌ అయ్యాయి కూడా! అందులో రామ్‌పోతినేనితో చేసిన రెడీ మూవీ ఒకటి. ఇది హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో రీమేక్‌ చేశారు. కానీ హీరోయిన్‌గా జెనీలియా (Genelia D'Souza)కు బదులుగా అసిన్‌ను తీసుకున్నారు. జెనీలియాను సల్మాన్‌ వద్దనడంపై అప్పట్లో చర్చ జరిగింది.

ఇంకో అవకాశం ఎదురుచూస్తుందేమో..
సితారే జమీన్‌ పర్‌ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న జెనీలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. రెడీ హిందీ రీమేక్‌లో మిమ్మల్ని తీసుకోనందుకు బాధపడ్డారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు హీరోయిన్‌.. అలాంటిదేం లేదు. కానీ నన్ను సంప్రదించుంటే సంతోషంగా ఒప్పుకునేదాన్ని. ఎందుకంటే అది నా సినిమా. అయినా ఆ అవకాశం పోయిందంటే సల్మాన్‌తో నటించేందుకు మరో మూవీ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో.. అని చెప్పుకొచ్చింది.

రుణపడి ఉన్నా
తర్వాత యాంకర్‌.. దక్షిణాదిన మంచి పాత్రలు దక్కలేదు కదా? అని ప్రశ్నించగా వెంటనే జెనీలియా కాదంటూ మధ్యలోనే అడ్డుకుంది. ఆమె మాట్లాడుతూ.. సౌత్‌లో నాకెప్పుడూ మంచి పాత్రలే దక్కాయి. నా సినిమాలు చూస్తే సౌత్‌లో నాకు ఎంత అద్భుతమైన పాత్రలు దక్కాయో తెలుస్తుంది. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. నాకు మంచి సినిమాలు ఇచ్చారు.. అందుకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఈరోజు హైదరాబాద్‌కు వెళ్లినా సరే హాసిని(బొమ్మరిల్లులో జెనీలియా పాత్ర పేరు) అంటే చాలు నా పేరు చెప్తారు. 

ఎంజాయ్‌ చేశా
తమిళంలో హరిణి (సంతోష్‌ సుబ్రహ్మణ్యం), మలయాళంలో ఆయేషా (ఉరుమి).. ఈ పేర్లతోనే నన్ను ఇప్పటికీ పిలుస్తుంటారు. అలాంటి పాత్రలు దక్కడం నా అదృష్టం. శంకర్‌, రాజమౌళి వంటి టాప్‌ డైరెక్టర్లతోనే కాకుండా కొత్త దర్శకులతోనూ పని చేశాను. ఈ మొత్తం ప్రక్రియను నేను ఎంజాయ్‌ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్‌ ఇండస్ట్రీపై విషం కక్కాలనుకున్న యాంకర్‌కు జెనీలియా గట్టిగానే బుద్ధి చెప్పిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

చదవండి: బిగ్‌బాస్‌లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్‌.. లైవ్‌లోనే

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)