Breaking News

ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు.. వారికోసమే ఇంకా బతికి ఉన్నా: స్టార్ డైరెక్టర్

Published on Mon, 01/13/2025 - 12:10

మలయాళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా కాల్ చేయలేదని అన్నారు. అసలేం జరిగిందో కూడా తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్ అవసరమైనప్పుడు ఎవరూ సహకరించలేదని అసహనం వ్యక్తం చేశారు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ..' ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. 2017లో నా సినిమా ధృవ నచ్చితిరమ్(తెలుగులో ధృవనక్షత్రం) విడుదల కాలేదు. కానీ ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కనీసం నా సమస్య గురించి ఎవరూ కూడా ఫోన్ చేయలేదు. అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కేవలం ధనుశ్ సార్,  లింగుసామి లాంటి వ్యక్తులు నా సినిమా చూశారు. విడుదల చేసేందుకు ప్రయత్నిచారు. కానీ వారికి ఉన్న సమస్యల వల్ల వీలుకాలేదు. మరికొందరికి ఈ సినిమా చూపించాను. కానీ కొన్ని సమస్యల వల్ల ఎవరూ ముందుకు రాలేదు. ప్రేక్షకులు ఇప్పటికీ సినిమాని చూడాలని కోరుకుంటున్నందు వల్లే ఇంకా నేను బతికి ఉన్నా.' అని అన్నారు. 

కాగా.. 2017లో విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నచ్చతిరమ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో  రీతూ వర్మ, ఆర్ పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఏడేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ అసహనం వ్యక్తం చేశారు. గౌతమ్ చాలా సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నించాడు.

నటుడిగా రాణిస్తున్న డైరెక్టర్

గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటనలో దూసుకెళ్తున్నారు. చివరిసారిగా 2024లో రత్నం, హిట్ లిస్ట్, హిట్లర్. విడుతలై పార్ట్- 2 చిత్రాలలో కనిపించాడు. అంతే కాకుండా త్వరలో వరాహం, బజూకా, తలపతి 69 చిత్రాల్లో నటించనున్నాడు. త్వరలోనే మలయాళంలో డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ అనే మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. అతని చివరిసారిగా దర్శకత్వం వహించిన 2024 చిత్రం జాషువా ఇమై పోల్ కాఖా ఇంకా విడుదల కాలేదు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)