Breaking News

నా వయసు 12 ఏళ్లు.. బస్సులో భయానక సంఘటన: బుల్లితెర నటి

Published on Mon, 05/05/2025 - 13:54

బాలీవుడ్ భామ, బుల్లితెర నటి గౌతమి కపూర్‌ బీ టౌన్‌లో పరిచయం చేయాల్సిన పనిలేదు. సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. గౌతమి చివరిసారిగా కొరియన్ డ్రామా రీమేక్‌ అయినా గ్యారహ్.. గ్యారహ్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలతో బిజీగా ఉన్న గౌతమి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన చిన్నతనంలో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.

ముంబయిలో పాఠశాల ఇంటికి వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తాను ఆరో తరగతిలో ఉండగా ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా తన ప్యాంట్ లోపలికి చేయి పెట్టాడని ఆ భయానక అనుభవాన్ని పంచుకుంది. అప్పుడు నా వయసు 12 ఏళ్లు కావడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపింది. ఆ తర్వాత భయంతో వెంటనే బస్సుదిగి వెళ్లిపోయానని గౌతమి కపూర్ ఆ చేదు సంఘటనను వివరించింది. ఆ వ్యక్తి నన్ను అనుసరిస్తున్నాడా అని నేను ఆలోచిస్తూనే ఉన్నానని వెల్లడించింది. ఈ విషయాన్ని అమ్మతో చెప్పడానికి భయపడ్డానని గౌతమి చెప్పింది.

ఈ సంఘటన జరిగినప్పుడు తాను తన స్కూల్ యూనిఫాంలోనే ఉన్నానని గౌతమి పంచుకుంది. ఇంటికి వచ్చి నా తల్లికి జరిగిందంతా వివరించానని తెలిపింది. వెంటనే 'నీకు పిచ్చి పట్టిందా? నువ్వు వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి కాలర్ పట్టుకుని ఉండాల్సిందని.. ఎప్పుడూ భయపడవద్దని అమ్మ నాకు ధైర్యం చెప్పిందని  తెలిపింది. ఎవరైనా అలా చేస్తే.. వారి చేతిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరవండి.. భయపడకుండా పెప్పర్ స్ప్రే వారి ముఖంపై కొట్టండి అని సలహా ఇస్తోంది బాలీవుడ్ భామ.

 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?