Breaking News

మరోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందిన ఢమరుకం విలన్‌, పోస్ట్‌ వైరల్‌

Published on Wed, 10/04/2023 - 13:02

గణేశ్‌ వెంకట్రామన్‌.. ముంబైలో పుట్టిపెరిగిన ఇతడు ఈనాడు, ఢమరుకం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ మధ్య తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొని థర్డ్‌ రన్నరప్‌గా నిలిచాడు. బుల్లితెర నటి నటి నిషా కృష్ణన్‌ను ప్రేమించిన ఇతడు 2015లో పెళ్లి చేసుకున్నారు. 2019లో వీరికి సమీరా అనే కూతురు జన్మించింది. తాజాగా మరోసారి ఈ దంపతులకు పండంటి బాబు పుట్టాడు. ఈ విషయాన్ని గణేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

ఇదెంతో ప్రత్యేకం..
'నీ చిట్టి చేతులతో నా వేలిని పట్టుకున్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. నేను నా జీవితంలో ఎన్నోరకాల పాత్రలు పోషించి ఉండవచ్చు. కానీ తండ్రి పాత్ర మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమైనది. మాకు బాబు పుట్టాడు. సాధారణ ప్రసవం జరిగింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాపై ప్రేమాభిమానాలు కురిపించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు అభిమానులు, సెలబ్రిటీలు స్పందిస్తూ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

సినిమాల సంగతి..
కాగా గణేశ్‌ వెంకట్రామన్‌ 'ద ఆంగ్రేజ్‌' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. 'అభియుమ్‌ నానుమ్‌' చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ఉన్నైప్పోల్‌, ఒరువన్‌ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ సినిమాలో విలన్‌గా నటించి ఇక్కడ పలు అవకాశాలు దక్కించుకున్నాడు. తెలుగులో చివరగా వారసుడు సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు 'ఉన్‌ పార్‌వైయిల్‌', 'వనంగముడి', 'ద డోర్‌' సినిమాలు చేస్తున్నాడు. గతంలో బుల్లితెరపై ప్రసారమైన 'వేందర్‌ వెట్టు కల్యాణం' అనే గేమ్‌ షోకి వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు.

చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్‌ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌? ఎవరా మిస్టరీ మ్యాన్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)