Breaking News

గేమ్ ఛేంజర్ విడుదల తేదీని ప్రకటించిన దిల్‌ రాజు

Published on Sun, 07/21/2024 - 21:29

రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదల తేదీని నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయిందని  డైరెక్టర్ శంకర్ తెలిపిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత చరణ్‌ నుంచి సినిమా రాలేదు కాబట్టి ఆయన ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.  'గేమ్ ఛేంజర్' పేరుతో రెండేళ్లుగా ఊరిస్తూనే ఉన్న ఇప్పటి వరకు అధికారికంగా మూవీ రిలీజ్ పై స్పష్టత లేదు. అటు డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 మూవీ ప్రమోషన్లలో ప్రకటిస్తాడు అనుకుంటే ఆయన కూడా రివీల్‌ చేయలేదు.

జులై 26న విడుదల కానున్న 'రాయన్‌' సినిమా ప్రీ- రిలీజ్‌ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌ రాజు 'రాయన్‌' చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.  ఈ క్రమంలో 'గేమ్‌ ఛేంజర్‌' విడుదల ఎప్పుడు అంటూ చరణ్‌ ఫ్యాన్స్‌ పట్టుపట్టారు. దీంతో ఆయన చెప్పక తప్పలేదు. 'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దిల్‌ రాజ్‌ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్‌ కూడా ఫుల్‌ ఖుషీ అయ్యారు. దిల్‌ రాజు చెప్పిన ప్రకారం డిసెంబర్‌ 25న గేమ్‌ ఛేంజర్‌ విడుదల కానుంది. దీపావళికి విడుదలవుతుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)