Breaking News

మెగా ప్యాన్స్‌ని భయపెడుతున్న ‘భారతీయుడు’

Published on Tue, 07/16/2024 - 17:15

సాధారణంగా పెద్ద డైరెక్టర్ల సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ వస్తే..దాని ఎఫెక్ట్‌ నెక్ట్స్‌ ఫిల్మ్‌పై కచ్చితంగా ఉంటుంది. సదరు డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు స్టార్‌ హీరోలు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు కూడా. ఒకవేళ అల్రేడీ సినిమా స్టార్ట్‌ చేసి ఉంటే.. సదరు హీరో అభిమానులకు టెన్షన్‌ తప్పదు. ఇప్పుడు రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌కి ఆ టెన్షన్‌ పట్టుకుంది. ‘భారతీయుడు 2’ రిజల్ట్‌ చూసి వారు భయపడిపోతున్నారు. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై తొలి రోజే నెగెటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఫలితంగా కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి.

భారతీయుడు 2 రిజల్ట్‌ చూసిన తర్వాత రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌తో టెన్షన్‌ మొదలైంది. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కానీ షూటింగ్‌ డిలే కావడంతో రీలీజ్‌ పోస్ట్‌ పోన్‌ అయింది. అయితే మొన్నటి వరకు చరణ్‌ ఫ్యాన్స్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ ప్రకటించాలని టీమ్‌పై ఒత్తిడి తెచ్చారు. అప్‌డేట్‌ ఇవ్వాలంటూ సోషల్‌ మీడయా వేదికగా శంకర్‌కి, నిర్మాత దిల్‌రాజ్‌కి విజ్ఞప్తులు చేశారు. కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్‌.. ఇప్పట్లో రిలీజ్‌ వద్దంటూ వేడుకుంటున్నారు. 

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో శంకర్‌పై ఫుల్‌ ట్రోలింగ్‌ నడుస్తోంది. భారతీయుడు 2 చిత్రాన్ని నాసిరకంగా తెరకెక్కించారంటూ శంకర్‌ని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో గేమ్‌ ఛేంజర్‌ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా.. ట్రోలింగ్‌ తప్పదు. అందుకే కొన్నాళ్ల పాటు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని, వీలైతే రిలీజ్‌ డేట్‌ని కూడా పోస్ట్‌పోన్‌ చేసుకోండి అని చిత్ర యూనిట్‌కి మెగా ఫ్యాన్స్‌  విజ్ఞప్తి చేస్తున్నారు. 

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)