Breaking News

Gal Gadot: నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ‘వండర్‌ వుమెన్‌’

Published on Thu, 03/07/2024 - 16:01

డిస్నీ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘వండర్‌ వుమెన్‌’ ఒకటి. 2017లో రిలీజైన ఈ హాలీవుడ్‌ మూవీతో గాల్‌ గాడోట్‌  సూపర్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తనదైన నటన, యాక్షన్‌, గ్లామర్‌తో యావత్‌ సినీ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత గాల్ గాడోట్‌ని  వండర్ వుమెన్‌గా పిలవడం ప్రారంభించారు. తాజాగా ఈ సూపర్‌ లేడి నాలుగోసారి తల్లైయింది.

బుధవారం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ పాపకు ఓరి అని నామకరణం చేసినట్లు పేర్కొంది. ‘ ప్రెగ్నెన్సీ అంత సులభం కాదు.. కానీ నీ రాకతో మా జీవితాల్లోకి వెలుగు వచ్చింది.  నీ పేరుగు తగినట్టే నీ లైఫ్‌లో వెలుగులు చిమ్మాలి అని ఆకాంక్షించారు. ఓరి అంటే హెబ్రూ భాషలో నా క్రాంతి అని అర్ధం’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది గాల్‌. 

కాగా, గాల్‌ గాడోట్‌ 2008లో జారోన్ వార్సానోను ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పటికే వీరిద్దరి ముగ్గురు ఆడ పిల్లలు. పేర్లు ఆల్మా(12), మాయా(6), డేనీయోలా(2). ఓరితో కలిపి మొత్తం నలుగురు సంతానం. 

సినిమాల విషయానికొస్తే.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్(2009) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గాల్‌ గాడోట్‌. ఆ తర్వాత వండర్‌ ఉమెన్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది.ఇప్పటికే 20పైగా సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్‌ భామ అలియా భట్‌ ఓ ప్రధాన పాత్ర పోషించింది. ఇది అలియా భట్‌కి తొలి హాలీవుడ్‌ మూవీ. ప్రస్తుతం మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 
(గాల్‌ గాడోట్‌ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)