Breaking News

స్టార్‌ హీరోను పట్టుకుని అలా తోసేస్తావేంటి? నటుడికి మణిరత్నం వార్నింగ్‌

Published on Sun, 04/06/2025 - 16:37

దర్శకుడు మణిరత్నం ఓసారి తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని, అప్పుడు షారూఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) తనకు సపోర్ట్‌ చేశాడని చెప్తున్నాడు నటుడు గజరాజ్‌ రావు. షారూఖ్‌, మణిరత్నం, గజ్‌రాజ్‌ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దిల్‌సే. 1998లో వచ్చిన ఈ సినిమా తెర వెనుక జరిగిన ఓ సంఘటనను గజరాజ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. దిల్‌సేలో నాది సీబీఐ ఆఫీసర్‌ పాత్ర. నేను షారూఖ్‌ ఖాన్‌ను ప్రశ్నించాల్సి ఉంటుంది. 

షారూఖ్‌ను గోడకు నెట్టేశా
అందుకు సంబంధించిన సన్నివేశం రిహార్సల్స్‌ చేస్తున్నాం. అందులో భాగంగా నేను షారూఖ్‌ను గోడకేసి కొట్టాను. అప్పుడు మణిరత్నం నాపై అసహనం వ్యక్తం చేశాడు. షారూఖ్‌ పెద్ద హీరో.. ఆయనొక స్టార్‌.. మనం ఈ సినిమా పూర్తి చేయాలి, అర్థమవుతుందా? ఆయన్ను అలా బలంగా నెట్టేయకు అని వారించాడు. కానీ షారూఖ్‌ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. ఇంతకుముందెలా చేశావో మళ్లీ అలాగే చేయు అని ఎంకరేజ్‌ చేశాడు

అందరికంటే ఎక్కువ ఎనర్జీ
నా బలాన్నంతా ఉపయోగించమనేవాడు. సెట్‌లో, బయటా అందరూ సమానమే అని చాటిచెప్పేవాడు. ఆయన్ను నేను రఫ్‌గా ఎందుకు హ్యాండిల్‌ చేశానంటే మేమిద్దరం ఢిల్లీలోని థియేటర్‌ స్కూల్‌ నుంచి వచ్చినవాళ్లమే! ఏదేమైనా షారూఖ్‌ ఎనర్జీ మిగతా అందరు నటులకంటే 10 వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది అని గజ్‌రాజ్‌ చెప్పుకొచ్చాడు. ఇతడు.. తల్వార్‌, బదాయి హో, రంగూన్‌, మేడ్‌ ఇన్‌ చైనా, శుభ్‌ మంగళ్‌ జ్యాద సావధాన్‌, మైదాన్‌, సత్యప్రేమ్‌ కీ కథ, బ్యాడ్‌ న్యూజ్‌, యుద్ర చిత్రాల్లో నటించాడు.

చదవండి: బీచ్‌లో సిగరెట్‌ తాగిన బోల్డ్‌ బ్యూటీ..

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)