Breaking News

గద్దర్‌ అవార్డ్స్‌: డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయిన బాలయ్య..వీడియో వైరల్‌

Published on Sun, 06/15/2025 - 09:06

నందమూరి బాలకృష్ణ స్పీచ్‌ గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడినా.. దానిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో అసలు అర్థమే కాదు. ఏదో చెప్పబోయి.. మరేదో చెబుతుంటారు. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులను అవలీలగా చెప్పినా.. బయట మాత్రం చిన్న చిన్న పదాలను కూడా సరిగ్గా పలకలేక తడబడుతుంటారు. 

ఆ మధ్య దేశభక్తి గేయం ‘సారే జహాసె అచ్చా’కూడా సరిగ్గా పాడలేక ట్రోలింగ్‌కి గురయ్యారు. ఇక తాజాగా మరోసారి బాలయ్య నవ్వుల పాలయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరు మర్చిపోయి.. దాన్ని కవర్‌ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట బాగా వైరల్‌ అయింది.

(చదవండి: సీఎం రేవంత్‌ సమక్షంలో అల్లు అర్జున్‌ మాస్‌ డైలాగ్‌..వీడియో వైరల్‌)

శనివారం సాయంత్రం హైటెక్స్‌లో జరిగిన గర్దర్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌  అవార్డుని ఇచ్చి సన్మానించింది. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ అవార్డును అందజేశారు. 

అనంతరం బాలకృష్ణ వారికి ధన్యవాదాలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో భట్టి పేరుని మర్చిపోయారు. ఆర్థిక, విద్యుత్‌ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి..(గ్యాప్‌ తీసుకున్నాడు).. మల్లు..(గ్యాప్‌ తీసుకున్నాడు) అంటూ పూర్తి పేరుని పలకడానికి తడబడ్డారు.   చాలాసేపు నీళ్లు నములుకున్న తర్వాత పక్కనే ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి అందించడంతో భట్టి పేరుని స్పష్టంగా పలికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)