Breaking News

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు..

Published on Mon, 09/08/2025 - 08:18

విశాఖపట్నం: దమ్ము శ్రీజ... ఈ పేరు ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి, తన దూకుడుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన ప్రతిభతో బిగ్‌బాస్‌లో కచ్చితంగా రాణిస్తుందని ఈ ప్రాంతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు..
శ్రీజ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నెలకు రెండు లక్షలకు పైగా జీతం సంపాదిస్తున్నప్పటికీ, తన ప్రతిభను నిరూపించుకోవడానికి బిగ్‌బాస్‌ను ఒక వేదికగా ఎంచుకున్నారు. ఆడిషన్స్‌ అనే అగ్నిపరీక్షలో నెగ్గి, ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

తండ్రి నిజాయతీ, అంకితభావం
శ్రీజ తండ్రి తండ్రి దమ్ము శ్రీను, జీవీఎంసీ 92వ వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు. వార్డులో ఏ సమస్య ఉన్నా, అది మురుగు కాల్వలైనా, చనిపోయిన వీధి కుక్కలైనా, వెంటనే అక్కడికి వెళ్లి పరిష్కరిస్తారు. ఒక సూపర్‌వైజర్‌గా కాకుండా, ఒక కార్మికుడిలా తన సిబ్బందితో కలిసి పనిచేసే గుణం ఆయనది. కొంతమంది దురభిమానం కారణంగా తోటి కార్మికుడు చేసిన దాడిలో ఒక కన్ను కోల్పోయారు.

శ్రీజకు మద్దతివ్వండి
తమ కుమార్తె శ్రీజకు మద్దతివ్వాలని శ్రీను దంపతులు కోరుతున్నారు. ప్రతీ ఎపిసోడ్‌లో ఆమె ఆట తీరును గమనించి, పూర్తి మద్దతు తెలిపి, ఓట్లు వేయాలని ప్రేక్షకులందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)