Breaking News

‘బాహుబలి’ సెట్‌లో ప్రభాస్‌ అల్లరి..ఎంత పని చేశావ్‌ దేవసేనా..?: వీడియో

Published on Sun, 08/03/2025 - 14:06

ప్రభాస్‌ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో అందరికి తెలిసిందే. పాన్‌ ఇండియా స్టార్‌ అయినా..ఇప్పటికీ తన చిన్ననాటి స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. సమయం దొరికితే ఫ్రెండ్స్‌ కలిసి టూర్స్‌ని వెళ్తుంటాడు. బయటకు సైలెంట్‌గానే కనిపిస్తాడు కానీ ప్రభాస్‌ చాలా అల్లరోడు అని రాజమౌళితో పాటు చాలా మంది స్నేహితులు చెప్పారు.

సెట్‌లో సరదాగా ఉంటాడని ఆయనతో కలిసి పని చేసిన నటీనటులు చెబుతుంటారు. అయితే తెర వెనుక ప్రభాస్‌ ఎలా ఉంటాడు? ఏ స్థాయిలో అల్లరి చేస్తాడో తాజాగా బహుబలి చిత్రబృందం బయటి ప్రపంచానికి చూపించింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రభాస్‌కి సంబంధించిన స్పెషల్‌ వీడియోని చిత్రబృందం సోషల్‌ మీడియాలో పంచుకుంది. అందులో ప్రభాస్‌ చాలా సరదాగా ఉన్నాడు. బాహుబలి గెటప్‌ వేసుకొని అనుష్కతో పాటు రానాపై ఫన్నీ పంచులు విసిరాడు. ‘ఎంత పని చేశావ్‌ దేవసేన’ అంటూ ‘అమ్మా లేడు నాన్న లేడు.. ’ అనే పాటను పాడుతూ రానాతో ముచ్చటించాడు. మధ్యలో అనుష్క వచ్చి ప్రభాస్‌తో మాట్లాడడంతో అంతా నవ్వారు’. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
 

 

 

బాహుబలి విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన బాహుబలి తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ 2015 జూలై 10న రిలీజ్‌ కాగా, మలి భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ 2017 ఏప్రిల్‌ 28న విడుదలైంది. ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు) పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడి పాత్రలో రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవగా నాజర్‌ కనిపిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)