Breaking News

వినాయకుడి చరిత్ర చెప్పిన మొదటి సినిమా ఏదో తెలుసా..?

Published on Sat, 09/07/2024 - 12:50

కొన్ని సినిమాలు ఎప్పటికీ వన్నెతరగవు. అందుకే బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రజెంట్‌ చేసినా వ్యూయర్స్‌ ఆదరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పండుగల లాంటి టైంలో వీటి ప్రత్యేకత ఏంటో జనాలకు తెలిసి వస్తుంది కూడా. అలాంటి సినిమాల్లో ‘శ్రీ వినాయక విజయం’ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రతీ వినాయక చవితికి క్రమం తప్పకుండా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది మళ్లీ టెలికాస్ట్‌ ప్రొమో రిలీజ్‌ కావడంతో సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

పూర్తి స్థాయిలో గణేషుడి కథను చూపిస్తూ తెలుగులో వచ్చిన మొదటి సినిమా ‘శ్రీ వినాయక విజయం’(1979). ఈ మూవీలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వినాయకుని జన్మ వృత్తాంతం చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ‘ఎవరవయ్యా.. ఎవరవయ్యా’ అంటూ సాగే గానం.. దేవులపల్లి రచన, సాలూరి స్వరాలు, సుశీలమ్మ పాడిన పాట ఇప్పటికీ పండపూట టీవీల్లో మారుమోగుతుంటుంది. అయితే ఆ వినాయకుడి గెటప్‌లో ఉన్న ఆర్టిస్ట్‌ ఎవరంటూ? గూగుల్‌ను ఆశ్రయించడంతో సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే, వినాయక చవితి అనే సినిమా 1957లోనే మొదటి సినిమాగా విడుదలైంది. కానీ, ఇందులో వినాయక వ్రతం గురించి మాత్రమే చూపించారు. విఘ్నేశ్వరుడి పూర్తి కథతతో ‘శ్రీ వినాయక విజయం’(1979) సినిమా విడుదలైంది. అలా ఈ చిత్రమే మొదటి చిత్రంగా సినీ అభిమానులు గుర్తిస్తారు.

ట్రెండింగ్‌లో 'శ్రీ వినాయక విజయం' చిత్రం
శ్రీ వినాయక విజయం చిత్రం ఆరోజుల్లోనే భారీ సక్సెస్‌ సాధించింది. ఈ సినిమాలో బాల గణేషుడిగా కనిపించింది బేబీ లక్ష్మి సుధా. ఆ తర్వాత ఏనుగు తల గెటప్‌తోనూ కాసేపు ఈ చిన్నారి అలరించింది. ఇక పెద్దయ్యాక వినాయకుడి గెటప్‌లో నటించింది ఎంజీవీ మదన్‌గోపాల్‌ అనే ఆర్టిస్ట్‌. ఈయన గురించి పూర్తి సమాచారం, ఫొటో గురించి .. వెతకాలని ప్రయత్నిస్తున్నారు చాలామంది.

కానీ, ఎలాంటి సమాచారం దొరకడం లేదు. అలా చాలా మంది వెతకడం వల్ల వినాయక విజయం మూవీ గూగుల్‌ ద్వారా సోషల్‌ మీడియాలో ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది ఇప్పుడు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)