Breaking News

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. పలు అనుమానాలు

Published on Thu, 03/07/2024 - 10:30

బాలీవుడ్ హీరోయిన్‌ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్‌మెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.  ముంబై బాంద్రావెస్ట్‌లో ఉండే నౌరోజ్ హిల్ సొసైటీలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమె ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసింది. అందులో 14వ ఫ్లోర్‌లో ఉండే ఒక ఫ్లాట్‌లో బుధవారం అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. కానీ 15వ ఫ్లోర్‌లో జాక్వెలిన్‌ ఉంటుంది. ఈ మంటలు ఆమె ఉండే నివాసం వరకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్‌కు కాల్ చేయడంతో వెంటనే వారు తమ సిబ్బందితో  అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని సమాచారం.

దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ. ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ  ఛార్జ్‌షీట్‌ దాఖలు కూడా చేసింది. కానీ ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  

సుఖేశ్‌ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేయడమే కాకుండా తన భావోద్వేగాలతో ఆడుకుని, తన కెరీర్‌, జీవనోపాధిని నాశనం చేశాడని చెప్పిన జాక్వెలిన్‌.. సుఖేశ్‌ వల్ల తనకు ప్రాణాపాయం ఉన్నట్లు కూడా తెలిపింది. ఇప్పుడు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు కిందనే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)