Breaking News

మొన్నే సినిమా రిలీజ్.. ఇప్పుడు టీమ్ పై పోలీస్ కేసు

Published on Fri, 04/18/2025 - 13:44

వారం క్రితం థియేటర్లలో రిలీజైన సినిమాకు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. తొలుత తమిళనాడులో వ్యతిరేకత రాగా.. తర్వాత క్రైస్తవుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఏకంగా మూవీ టీమ్ అందరిపై పోలీస్ కేసు(FIR On Jaat Team) నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేమైంది?

తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన లేటెస్ట్ సినిమా 'జాట్'(Jaat Movie). బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించాడు. టాలీవుడ్ యాక్టర్స్ జగపతిబాబు, రమ్యకృష్ణ, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)

యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు వివాదాలు మాత్రం తప్పట్లేదు. తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈని ఓ ఉగ్రవాద సంస్థగా చూపించారని కొందరు తమిళియన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చర్చిల కొన్ని సన్నివేశాలు తీయడంపై పలు క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూవీని బ్యాన్ చేయాలని కోరాయి.

ఇ‍ప్పుడు మనోభావాలు దెబ్బతీశారని జాట్ మూవీ టీమ్ పై.. పంజాబ్ లోని జలంధర్ లో పోలీస్ కేసు పెట్టారు. వికల్ప్ గోల్డ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలో శిలువను కించపరిచేలా చూపించారని, క్రైస్తవుల పర్వదినాలైన గుడ్‌ప్రైడే, ఈస్టర్ వచ్చే నెలలో ఈ మూవీని ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారని వికల్ప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)