Breaking News

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. స్టార్ హీరోకు షాకిచ్చిన పోలీసులు!

Published on Mon, 01/08/2024 - 18:39

ఇటీవలే కాటేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కన్నడ స్టార్ హీరో దర్శన్. గతేడాది చివర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కర్ణాటక వ్యాప్తంగా రికార్డ్ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ శాండల్‌వుడ్‌ స్టార్ హీరో దర్శన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన దర్శన్.. సమయం ముగిసిన తర్వాత పార్టీని కొనసాగించారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

పార్టీకి హాజరైన సినీ ప్రముఖులతో పాటు పబ్ యజమానిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో హీరో దర్శన్‌తో పాటు ధనంజయ, అభిషేక్ అంబరీష్, రాక్‌లైన్ వెంకటేష్‌లకు పోలీసు అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఎఫ్‌ఐఆర్‌పై ఇప్పటివరకు నటీనటులు ఎవరూ స్పందించలేదు. 

అసలేం జరిగిందంటే.. 

న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులోని రాజాజీ నగర్‌లోని ఓ పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో కన్నడ నటీనటులు పాల్గొన్నారు. అయితే సమయానికి మించి అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా పార్టీని కొనసాగించారు. సెలబ్రిటీలంతా కేక్‌లు కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.  కాగా.. దర్శన్ నటించిన కాటేరా చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో కనిపించారు. 
 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)