Breaking News

'అఖండ-2' వాయిదా, రిలీజ్‌పై స్పందించిన సురేశ్‌ బాబు

Published on Fri, 12/05/2025 - 14:52

బాలకృష్ణ- బోయపాటి శ్రీను  అఖండ2 సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.. దీంతో పలు రకాలుగా కథనాలు వైరల్‌ అయ్యాయి. అయితే, తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు స్పందించారు. అఖండ2 గురించి తప్పుడు వార్తలు రావడం దురదృష్టకరమని అన్నారు. శ్రీనందు హీరోగా నటించిన 'సైక్‌ సిద్ధార్థ'  సాంగ్‌ లాంఛ్‌ కార్యక్రమంలో  సురేశ్‌ బాబు పాల్గొన్నారు. అఖండ 2 గురించి మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడారు.

'అఖండ2 విడుదల అవుతుందని ఆశతో ఉన్నాం.  ఆ సినిమా కోసం బ్యాక్‌ ఎండ్‌లో చాలామంది కష్టపడుతున్నారు. గతంలో చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారమవుతుంది అనుకుంటున్నాను. నేను కూడా  ఆ సమస్యను క్లియర్‌ చేద్దామని వెళ్లాను. దీంతోనే ఈ కార్యక్రమానికి రావడం కాస్త ఆలస్యమైంది. ప్రతి సినిమా విషయంలో కొన్ని  ఆర్థికపరమైన చిక్కులు ఉంటాయి. వాటిని ఎవరూ బయటకు వెల్లడించకూడదు. 

అయితే, కొందరు వారికి నచ్చినట్లు కథనాలు రాసేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల గురించి తమకు తోచినట్లుగా రాస్తున్నారు. అఖండ2 వాయిదా పడటానికి ఇన్ని కోట్లు అటా.. అసలు కారణం ఇదే.. వంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సమస్యలు అన్ని క్లియర్‌ అవుతాయి. తప్పకుండా మంచి వార్తే అందుతుంది.' అని సురేశ్‌ బాబు అన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)