Breaking News

జూన్‌లో దర్శకులు మధుసూదనరావు శత జయంతి ఉత్సవాలు

Published on Tue, 05/16/2023 - 06:13

ప్రముఖ దివంగత దర్శకులు వీరమాచనేని మధుసూదనరావు (జూన్‌ 14, 1923లో జన్మించారు) శతజయంతి ఉత్సవాలు జూన్‌ 11న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సమావేశంలో దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మధుసూదనరావుగారు మన మధ్య లేకపోయినా దర్శకుడిగా ఆయన ప్రతిభ మరికొన్ని వందల ఏళ్లు బతికే ఉంటుంది.

ఆయన దగ్గర శిష్యరికం చేయడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలకు సినీ పరిశ్రమ నుంచి అందర్నీ ఆహ్వానిస్తున్నాం’’ అన్నారు మధుసూదనరావు కుమార్తె వాణీదేవి. ‘‘ఈ సంవత్సరం నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, సూర్యకాంతంగారు, వి. మధుసూదనరావుగారి శత జయంతి కావడం తెలుగు పరిశ్రమ పులకించి పోయే సంవత్సరం. మన మధ్య లేకపోయినా వారు పరిశ్రమకు చూపించిన మంచి మార్గాన్ని ఎప్పటికీ అనుసరిస్తూనే ఉంటాం’’ అన్నారు శివాజీరాజా. ‘‘మావయ్య విలువలతో జీవించారు. అదే విలువలను తన చిత్రాల ద్వారా పది మందికి పంచటానికి ప్రయత్నించారు’’ అన్నారు నాని (మధుసూదనరావు మేనల్లుడు). ఈ కార్యక్రమంలో మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రిన్సిపాల్‌ డా. జి. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)