Breaking News

పాపం హరీష్‌ శంకర్‌.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు

Published on Sat, 04/11/2026 - 18:16

పాపం ప్రతాప్‌ సినిమా ట్రైలర్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హరీష్‌ దర్శకత్వంలో  పవన్ కల్యాణ్‌ నటించిన  తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'  భారీ డిజాస్టర్‌ అయినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత కూడా హరీష్ దానిని తీవ్రంగా ప్రచారం చేస్తూనే వచ్చారు. అతను వాస్తవాన్ని అంగీకరించడం లేదని  ప్రేక్షకుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే,  తిరువీర్ నటించిన 'పాపం ప్రతాప్'  సినిమా కార్యక్రమంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆశించిన స్థాయిలో ఆడలేదని ఎట్టకేలకు అంగీకరించాడు.

దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ వేదికపై ఇలా అన్నాడు. "ఈ కార్యక్రమానికి వస్తుండగా యాంకర స్రవంతి  నన్ను ‘పాపం హరీష్’ అని పిలిచింది. నా సినిమా (ఉస్తాద్ భగత్ సింగ్) థియేటర్లలో సరిగ్గా ఆడకపోవడం వల్లే ఆమె అలా పిలిచిందని మొదట అనుకున్నాను. ఆ తర్వాత, ఆమె అందరినీ ‘పాపం’ అనే సంబోధనతో పిలవడం మొదలుపెట్టింది. అందుకే ఫర్వాలేదని అనుకున్నాను," అని హరీష్ శంకర్  అన్నారు. అందుకు సంబంధించిన క్లిప్‌ వైరల్‌ అవుతుంది.
 

Videos

జగన్, అవినాష్ రెడ్డిలపై షర్మిల కామెంట్స్ ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

ఏపీలో అంతా ఊడ్చేశాం..! ప్యూచర్ తెలంగానే బాబు మాస్టర్ స్కెచ్..

ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి

ఇన్వెస్టర్ల పంట పండింది భారీగా పెరిగిన బంగారం ధర

అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!

బయటపడ్డ ఏపీపై చంద్రబాబు కపట ప్రేమ

చంద్రబాబు తెలంగాణకు షాడో సీఎం, జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలవుతుందా?

కావాలనే నాపై తప్పుడు ప్రచారం... లాయర్‌పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు

కారుపై పడ్డ కాంక్రీట్ లారీ

Photos

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)