Breaking News

కొత్త రూల్స్‌.. తమిళనాడులోనే షూటింగ్‌.. తమిళులకే ఛాన్స్‌!

Published on Fri, 07/21/2023 - 09:49

తమిళ చిత్రాలను అనవసరంగా విదేశాల్లో షూటింగ్‌ నిర్వహించరాదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. ఈ సమాఖ్య నిర్వాహకులు, తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు బుధవారం సాయంత్రం చైన్నెలో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలను సెల్వమణి మీడియాకు వెల్లడించారు.

అందులో ఒక సినిమాను నిర్మించడానికి ముందు నటీనటులు, సాంకేతికవర్గంతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ వివరాలను ఫెఫ్సీకి లిఖిత పూర్వక లేఖ రాసి అందజేయాలన్నారు. అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయని చిత్ర నిర్మాత ఫెఫ్సీకి లిఖితపూర్వక లేఖను అందించిన తర్వాతే ఫెప్సీ కార్మికులు ఆ చిత్రాల్లో పనిచేస్తారన్నారు. లేకుంటే 2022, మార్చిలో చేసుకున్న ఒప్పందంలోని నిబంధనల్లో ప్రధానంగా తమిళ చిత్రాల షూటింగ్‌లలో తమిళ కళాకారులకే పని కల్పించాలని, తమిళ చిత్ర షూటింగ్‌ లను తమిళనాడులోనే నిర్వహించాలని చెప్పారు.

షూటింగ్‌లో పనిచేసే దినసరి కార్మికులకు అదేరోజు వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. చిత్ర కథను దర్శకుడే రాసుకుంటే ఆ తర్వాత ఆ కథ గురించి తలెత్తే సమస్యలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నిర్మాతలను సమస్యల్లోకి లాగకూడదన్నారు. ఇతర రచయిత కథ అయితే దర్శకుడు అందుకు తగిన విధివిధానాలను రూపొందించాలన్నారు. చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన బడ్జెట్లో నిర్ణయించిన రోజుల్లో పూర్తిచేయలేకపోతే నిర్మాతల వర్గం అందుకు కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈనిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

చదవండి: ప్రాజెక్ట్‌ కె టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)