Breaking News

'దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు'.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై దంగల్ నటి షాకింగ్ కామెంట్స్!

Published on Mon, 01/27/2025 - 20:47

అమిర్ ఖాన్ నటించిన దంగల్‌ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ దంగల్ రికార్డ్‌ పదిలంగానే ఉంది. ఫాతిమా సనా షేక్ చివరిసారిగా ఆదిత్యరాయ్ కపూర్ సరసన మెట్రో ఇన్ డైనో చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అంతకుముందు 2023లో బాలీవుడ్ మూవీ సామ్ బహదూర్‌లోనూ కనిపించింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునేవారని ఆరోపించింది. కష్టపడి సంపాదిస్తున్న నటులను మోసం చేసేవారని తెలిపింది. ఆడిషన్స్‌ పూర్తయ్యాక క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ 15 శాతం కమిషన్‌ తీసుకున్నాకే మాకు పేమేంట్ ఇచ్చేవారని పేర్కొంది. కానీ కొందరు మాత్రం మంచివారు కూడా ఉండేవారని తెలిపింది. సినీ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన నటులను దోచుకునే నీచమైన వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించింది. అంతేకాకుండా తన కెరీర్‌లో తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది.

ఓ డైరెక్టర్‌తో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఫాతిమా సనా షేక్ తెలిపింది. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమేనా? అని ఒక దర్శకుడు నన్ను అడిగారని చెప్పుకొచ్చింది. నేను కష్టపడి పని చేస్తానని.. పాత్రకు అవసరమైనది వందశాతం చేస్తానని అతనితో చెప్పాను.. కానీ అతను అంత దిగజారిపోయి మాట్లాడతారని అనుకోలేదని ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేసింది.

అంతేకాకుండా హైదరాబాద్‌లో చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్న సంఘటనను గుర్తుచేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతున్నానని వెల్లడించింది. మేము ఒక గదిలో ఉండగా.. కొందరు నిర్మాతలు దాని గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారని.. మేం చెప్పినవాళ్లను మీరు కలవాలని నాతో అన్నారని పేర్కొంది. ఆ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయేదని తెలిపింది. అయితే అందరూ అలా ఉండరని కూడా ఫాతిమా సనా షేక్ చెప్పింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)