Breaking News

తమన్నా మాజీ ప్రియుడితో డేటింగ్‌.. దంగల్ నటి ఏమన్నారంటే?

Published on Thu, 06/26/2025 - 16:57

దంగల్‌ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అమిర్‌ ఖాన్ దంగల్‌ మూవీలో గీతా ఫోగట్ పాత్రలో ఆమె అదరగొట్టేసింది. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ ‍అనే చిత్రంలోనూ నటించింది.  అయితే ఆ మూవీ తర్వాత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే  ఒక నిర్మాత నుంచి కాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు  గతంలో చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె 'మెట్రో... ఇన్ డినో' అనే మూవీలో కనిపించనుంది.

ఈ మూవీ తర్వాత ఫాతిమా సనా షేర్.. గుస్తాక్ ఇష్క్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మ హీరోగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి జంటగా కనిపించారు. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. విజయ్ వర్మతో సనా డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్ పుట్టకొచ్చాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న  ఊహాగానాలపై ఫాతిమా సనా షేక్ స్పందించింది. తన రాబోయే చిత్రం ఆప్ జైసా కోయి' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? అడిగిన ప్రశ్నకు ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని. నా జీవితంలో ఎవరూ లేరని స్పష్టం చేసింది.

ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ..'ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నా. నా లైఫ్‌లో ఎవరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు మంచి వ్యక్తులంటూ ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటారు. మీరు ఏదైనా పార్ట్‌నర్‌షిప్‌లో ఉంటే మిమ్మల్ని మీరు కోల్పోకుండా రిలేషన్‌ స్ట్రాంగ్‌ ఉండేందుకు కృషి చేస్తారు. రిలేషన్‌ బలంగా ఉండాలంటే అదే మార్గమని నేను భావిస్తున్నా' అని క్లారిటీ ఇచ్చేసింది.

ఆప్ జైసా కోయి మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రేమ, సమానత్వం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవిస్తారు. వారు ఒకరి మాట ఒకరు వింటారు. వాటిని తిరస్కరించరు. ఈ సినిమాలో ప్రేమ, సమానత్వం గురించేనని.. ఈ విషయంలో ఇద్దరూ రాజీ పడాలని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కాగా.. ఆప్ జైసా కోయి చిత్రంలో ఆర్ మాధవన్ సరసన నటించింది. మాధవన్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా అద్భుతంగా అనిపించిందని వెల్లడించింది. ఇప్పటికే 'ఆప్ జైసా కోయి' ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూలై 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)