Breaking News

యాక్షన్‌ చేయడం సవాల్‌గా అనిపించింది: ఫరియా అబ్దుల్లా

Published on Fri, 09/06/2024 - 01:11

‘‘మత్తు వదలరా 2’ చిత్రంలో నాపాత్ర పేరు సన్నిధి. ఇందులో నేను, శ్రీ సింహా, సత్య స్పెషల్‌ ఏజెంట్స్‌గా కనిపిస్తాం. అయితే వారిపాత్రలపై సాఫ్ట్‌ కార్నర్‌ ఉంటుంది. నాపాత్రలో యాక్షన్‌ ఉంటుంది. గన్స్  పట్టుకుని యాక్షన్‌ చేయడం సవాల్‌గా అనిపించినా చాలా ఎంజాయ్‌ చేశాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తారు’’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా రితేష్‌ రానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మత్తు వదలారా 2’. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని నటీనటులు ఎదుర్కొనే ట్రాజెడీ నుంచి కామెడీ పుడుతుంది (నవ్వుతూ). రితేష్‌ రానాగారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్‌. కాల భైరవగారి సంగీతం సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో నేను ఓపాటకి లిరిక్స్‌ రాసి,పాడి, కొరియోగ్రఫీ చేయడం సంతోషంగా ఉంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అతిథిపాత్ర చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కి థ్యాంక్స్‌. ప్రభాస్‌గారితో పెద్దపాత్ర ఉండే సినిమా చేయాలనుకుంటున్నాను.

‘జాతి రత్నాలు’ చిత్రంలో నేను చేసిన చిట్టిపాత్ర నా ఇంటిపేరు అయి΄ోయింది. ఎక్కడికెళ్లినా ఇప్పటికీ చిట్టి అని పిలుస్తుంటారు. అయితే ‘జాతి రత్నాలు’ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్‌ అయితే నాకు రాలేదు. ‘మత్తు వదలరా 2’తో వస్తుందని నమ్ముతున్నాను. ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్యగార్లతో ప్రత్యేకపాట చేశాను. ఆ తర్వాత స్పెషల్‌ సాంగ్స్‌ చేయమని కొందరు అడిగారు... కానీ, చేయలేదు. తమిళంలో నేను నటించిన ‘వల్లి మయిల్‌’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. తెలుగులో తిరువీర్‌కి జోడీగా ఓ సినిమా చేస్తున్నాను. అలాగే మరో తమిళ సినిమా ప్రారంభం కాబోతోంది’’ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)