Breaking News

సినిమా అంటే నేనొక్కడినే కాదు: ఫర్హాన్‌ అక్తర్‌

Published on Sat, 06/22/2024 - 00:28

హిందీలో ‘దిల్‌ చాహ్‌తా హై’ (2001), ‘లక్ష్య’ (2004), ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌’ (2006), ‘డాన్‌ 2: ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ (2011)’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభను నిరూపించుకున్నారు ఫర్హాన్‌ అక్తర్‌. కానీ ‘డాన్‌: ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ తర్వాత ఫర్హాన్‌ దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్‌ పట్టలేదు. అయితే దాదాపు మూడేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్‌ లీడ్‌ రోల్స్‌లో ‘జీ లే జరా’ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు ఫర్హాన్‌.

కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే రణ్‌వీర్‌ సింగ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ‘డాన్‌ 3’ ప్రకటన వచ్చింది. ఈ సినిమా కూడా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. తాజాగా ఈ విషయాలపై స్పందించారు ఫర్హాన్‌. ‘‘నేను దర్శకుడిగా సెట్స్‌లోకి వెళ్లక పదేళ్లకు పైనే అయింది. నటుడిగా బిజీగా ఉండటం వల్లే డైరెక్షన్‌కి టైమ్‌ కుదరలేదు. ‘డాన్‌ 3’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభమవుతుంది.

అలాగే ‘జీ లే జరా’ కూడా నా దర్శకత్వంలోనే ఉంటుంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా టైమ్‌ గడిచింది. సినిమా అంటే నేనొక్కడినే కాదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కాల్షీట్స్‌ అన్నీ కరెక్ట్‌గా కుదరాలి. నా దర్శకత్వంలో రాబోయే నెక్ట్స్‌ రెండు సినిమాలు ‘డాన్‌ 3, జీ లే జరా’నే’’ అన్నారు ఫర్హాన్‌ అక్తర్‌.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు