Breaking News

సినిమా కోసం అధిక వడ్డీకి అప్పులు.. దేశం విడిచి వెళ్లిపోలేదు: నటుడు

Published on Sun, 06/16/2024 - 15:33

బాలీవుడ్‌ నటుడు ఫర్దీన్‌ ఖాన్‌ ఇటీవలే హీరామండి వెబ్‌ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అతడు తన చిన్ననాటి సంగతులను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తండ్రి, స్టార్‌ హీరో ఫిరోజ్‌ ఖాన్‌ చేసిన పని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిపాడు. 'నాన్న హీరోగా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్‌ అయ్యాడు. 1972లో అపర్ధ్‌ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ సమయంలో నిర్మాతలు అధిక వడ్డీకి అప్పు తీసుకుని చిత్రాలు చేసేవారు. నాన్న కూడా అలానే చేశాడు. అది చూసి మేమంతా భయపడ్డాం.

ఆర్థిక ఇబ్బందులు
తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టార్‌ హీరో కుమారుడిని అని గల్లా ఎగరేసి చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. మా అమ్మ ఎయిర్‌ ఇండియాలో ఫ్లైట్‌ అటెండెంట్‌గా 9 సంవత్సరాలు పని చేసింది. అమ్మానాన్న ఇద్దరూ మాకోసం కష్టపడేవారు. ప్రతి ఏడాది లాంగ్‌ వెకేషన్‌కు తీసుకువెళ్లేవారు. కొన్నిసార్లు ఆ వెకేషన్‌ కూడా ఆపేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బర్త్‌డే పార్టీ కూడా చిన్నగా జరిపేవారు. అలా అని తినడానికి తిండి లేనంత దీన స్థితిలోనైతే లేము అని పేర్కొన్నాడు.

దేశం విడిచి పారిపోలేదు
ఇండస్ట్రీకి 14 ఏండ్లు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. నేను సినిమాలకు దూరంగా ఉన్నమాట వాస్తవమే.. కానీ దేశం విడిచి వెళ్లిపోలేదు. కొన్నాళ్లపాటు అక్కడ ఉండి మళ్లీ ఇండియాకు వచ్చేశాను.. ఇక్కడే ఉన్నాను. కొన్నేళ్ల క్రితం నేను కాస్త లావయ్యాను. నా అవతారం చూసి సినిమాలు పూర్తిగా మానేసినట్లున్నాడని అంతా అనుకున్నారు. నిజంగా 14 ఏళ్లు మూవీస్‌కు దూరంగా ఉండటం నేను చేసిన అతిపెద్ద పొరపాటు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫర్దీన్‌ ఖేల్‌ ఖేల్‌ మే, విస్ఫోట్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. 

చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)