Breaking News

ఐవీఎఫ్‌ ద్వారా ప్రెగ్నెన్సీ.. డాక్టర్‌ ఒకరిని తీసేస్తానంది!

Published on Wed, 03/27/2024 - 16:00

బహుముఖ ప్రజ్ఞాశాలి ఫరాఖాన్‌.. కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌, నటి, నిర్మాత, డ్యాన్సర్‌గా చిత్రపరిశ్రమలో రాణిస్తోంది. ఈమె 2004లో దర్శకుడు, ఎడిటర్‌ శిరీష్‌ కుందర్‌ను పెళ్లాడింది. పిల్లల కోసం కలలు కన్నారు. కానీ సహజంగా ఆ కల నెరవేరకపోవడంతో ఐవీఎఫ్‌ పద్ధతిని ఆశ్రయించారు. ఐవీఎఫ్‌ ద్వారా 2008లో ముగ్గురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చింది. తాజాగా అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుంది ఫరా ఖాన్‌.

గర్భం దాల్చానని గుడ్‌న్యూస్‌
ఆమె మాట్లాడుతూ.. 'నేను, శిరీష్‌ ఎప్పుడూ పిల్లల గురించే ఆలోచించేవాళ్లం. వాళ్లు పుట్టాక ఏం పేర్లు పెట్టాలి? మన లైఫ్‌ ఎలా ఉండబోతుంది? అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ ట్రై చేసినప్పుడు డాక్టర్‌ నన్ను పిలిచి గర్భం దాల్చినట్లు చెప్పింది. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దంది. మేము షాకవుతూనే ఏమైందని అడిగాం. ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఏర్పడ్డాయని చెప్పింది.

ఇద్దరు కాదు ముగ్గురు
మేము ట్విన్స్‌ పుడతారేమోననుకున్నాం. వాళ్లకు ఏ పేర్లు పెట్టాలా? అని తెగ ఆలోచించాం. ఓ రోజు శిరీష్‌.. ఒకవేళ గర్భంలో ముగ్గురుంటే.. ఇంకో పేరు కూడా ఆలోచించాలి కదా అన్నాడు. అలా చిత్రవిచిత్ర పేర్లు పెట్టుకున్నాం. ఒకరోజు డాక్టర్‌ పిలిచి నీ కడుపులో ఉన్నది ఇద్దరు కాదు ముగ్గురు.. నీకు 43 ఏళ్లు రాబోతున్నాయి. ఈ వయసులో ముగ్గురిని మోయడం నీకంత మంచిది కాదు. డెలివరీ సమయంలో ఏదైనా ఇబ్బందులు రావొచ్చు. ఒక బేబీ చిన్నదిగా పుట్టే ఆస్కారం ఉంది, ఒకసారి ఆలోచించమని సూచించింది.

ఏడున్నర కిలోలు..
నేను బిడ్డను తీసేయడానికి ఒప్పుకోలేదు. కడుపులో ఉండే శిశువు రెండు కిలోలవరకు బరువుండాలని చెప్పింది. పిల్లలు సరైన బరువుతో పుట్టేలా చూసుకుంటానన్నాను. మీరు నమ్మరు గానీ... నా పిల్లలు ఒక్కొక్కరు రెండున్నర కిలోల బరువుతో జన్మించారు. అంటే ఏడున్నర కిలోలు నా పొట్టలో మోస్తూ తిరిగాను' అని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్‌ తన పిల్లలకు సిజర్‌, అన్య, దివ అనే పేర్లు పెట్టింది. ఆ ముగ్గురూ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

చదవండి: తల్లి మనసు ఎంత గొప్పదో.. చరణ్‌కు మర్చిపోలేని గిఫ్ట్‌

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)