Breaking News

'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!

Published on Sun, 01/19/2025 - 15:30

వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వందకోట్లకు వసూళ్లతో సంక్రాంతి రేసులో అదరగొడుతోంది.

అయితే ఈ మూవీ ఎంత హిట్టయిందో.. అదే రేంజ్‌లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్‌ మీట్‌లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.

అయితే తాజాగా బుల్లిరాజుతో కొందరు అభిమానులు వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు కొందరు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అయితే ఇదే క్రమంలో బుల్లిరాజు ఇ‍బ్బందిగా ఫీలవుతున్నా కూడా వారు వదల్లేదు. దయచేసి నన్ను వదిలేయండి అని బుల్లిరాజు చెప్పినా వారస్సలు పట్టించుకోలేదు. చిన్న పిల్లాడితో ఇలా వ్యవహరించడం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. జరగండి.. నేను వెళ్లాలి అని బుల్లిరాజు చెబుతున్నా వినకుండా అతనితో ఫోటోలు తీసుకున్నారు. చిన్న పిల్లాడు అని చూడకుండా ఈ పైత్యం ఏంటని పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)