ఎన్నికల్లో వర్కౌట్ అయిన 'గ్లామర్'.. ఎవరెవరు ఎక్కడ గెలిచారంటే?

Published on Wed, 06/05/2024 - 12:05

ఎన్నికల సందడి అయిపోయింది. దేశంలో ఎన్టీయే ప్రభుత్వం అధికారం దక్కించుకుంది. మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించగా, చంద్రబాబు సీఎం కానున్నారు. వీళ్ల సంగతి పక్కనబెడితే దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలువురు సెలబ్రిటీలు అధికారం దక్కించుకున్నారు. కొందరికి మాత్రం నిరాశ తప్పలేదు.

(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా ఎన్నికైంది.

మలయాళ నటుడు సురేష్ గోపీ రికార్డ్ సృష్టించారు. త్రిసూర్ నుంచి ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.

టీవీ సీరియల్ 'రామాయణ్'తో చాలా గుర్తింపు తెచ్చుకున్న రాముడు పాత్రధారి అరుణ్ గోవిల్.. ఈసారి మీరట్ నుంచి ఎంపీగా గెలిచారు.

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేసిన రచనా బెనర్జీ.. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచి ఎంపీగా జయకేతనం ఎగరవేసింది.

'రేసుగుర్రం' విలన్ రవికిషన్.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఈయన రెండోసారి గెలిచారు.

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ హేమామాలిని.. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం.

బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్ సోల్ నుంచి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీలుగా గెలిచారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, హిందుపూర్, పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం సాధించారు.

ఇలా చాలామంది ఈ సారి ఎన్నికల్లో గెలిచారు. మరోవైపు కొందరు ఓడిపోయారు కూడా. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీత.. షిమోగాలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ ఎంపీ బరిలో దిగి ఓడిపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ స్పోర్ట్స్ బయోపిక్ మూవీ.. ఫ్రీగా స్ట్రీమింగ్)

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)