Breaking News

రష్మిక బర్త్‌డే రోజే వస్తున్న 'ఫ్యామిలీ స్టార్‌'... విజయ్‌ ఏం చెప్పాడంటే?

Published on Sun, 03/31/2024 - 17:56

విజయ్‌ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీస్టార్‌’ మరో కొద్దిరోజుల్లో థియేటర్‌లోకి రానున్నాడు. వేసవి సందర్భంగా ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.  ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు - శిరీశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కుటుంబ వినోదంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. అందులో భాగంగా ఫ్యామిలీ స్టార్‌తో కిట్టీ పార్టీ అంటూ ఇండిస్ట్రీకి చెందిన కొందరు నటీమణులతో విజయ్‌ దేవరకొండి చిట్‌చాట్‌ జరిపారు. 

ఈ సందర్భంగా సినిమా విడుదల విషయంలో విజయ్‍కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల అవుతుంది కదా.. ఆ తేదీన ఏదైనా విశేషం ఉందా..? అని విజయ్ దేవరకొండను ఓ నటి అడిగారు. ఏప్రిల్‌ 5న ఫ్యామిలీ స్టార్‌ విడుదల చేయడానికి ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉండటమే అని విజయ్‌ దేవరకొండ చెప్పారు.  దీంతో అక్కడ ఉన్న వారు నవ్వడం ప్రారంభించారు. 'యాదృచ్ఛికంగా ఎప్రిల్‌ 5న ఇంకేదో ఉంది.. అదే రష్మిక మందన్న పుట్టినరోజు అనుకుంటా' అని మరోకరు అన్నారు.

దీనికి విజయ్ మాట్లాడుతూ.. 'అవును ఆరోజున రష్మిక పుట్టినరోజు ఉంది. అది మాకు లక్కీ అవుతుందని అనుకుంటున్నాను.' అని అన్నారు.  వాస్తవంగా ఏప్రిల్‌ 5,6,7 తేదీలు వీకెండ్‌తో ముగుస్తాయి. ఆ తర్వాత వెంటనే ఉగాది, రంజాన్‌ పండుగలు ఒకే వారంలో ఉన్నాయి. దీంతో ఫ్యామిలీ స్టార్‌కు కలెక్షన్స్‌ పరంగా బాగా కలిసొస్తుందని విజయ్‌ పేర్కొన్నాడు.

విజయ్‌- రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.  ఏప్రిల్ 5వ తేదీన రష్మిక పుట్టినరోజు ఉంది.. సినిమా కూడా అదేరోజున విడుదల కానున్నడం ఇప్పుడు వారి ప్రేమ విషయం మరింత ఆసక్తిగా మారింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)